టీడీపీ కీలక నేత , మాజీ మంత్రి దేవినేని ఉమకి సీఐడీ నోటీసులు ఇష్యూ చేసింది. ఈ రోజు కర్నూలు సీఐడీ ప్రాంతీయ కార్యాలయంలో హాజరుకావాలని నోటీసులు పంపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేసిన నేపథ్యంలో సీఐడీ అధికారులు దేవినేని ఉమపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.సీఎం జగన్ మోహన్ రెడ్డి మాటలను వక్రీకరించారని న్యాయవాది ఫిర్యాదు చేయడంతో సెక్షన్ 464, 465, 468, 471, 505 కింద దేవినేని ఉమాపై సీఐడీ కేసు నమోదు చేసింది.
ఈ నెల 7 వ తేదీన దేవినేని ఉమ ట్విట్టర్ లో పెట్టిన ఓ వీడియో పెను వివాదానికి దారితీసింది. ఆ వీడియోలో మాటలు సీఎం జగన్ తిరుపతిని కించపరిచే ఉన్నాయి. ఎవరైనా గొప్పవాళ్ళు తిరుపతికి రావటానికి ఇష్టపడరు అంటూ తిరుపతిని ఒడిశా, బీహార్ తో పోల్చారు . ఈ వీడియో నకిలీది అంటూ ఫ్యాక్ట్ చెక్ ద్వారా తేలిందని సీఐడీకి ఫిర్యాదు అందింది. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమ పై కేసు నమోదు అయ్యింది. ఈ కేసు పై స్పందించిన మాజీ మంత్రి దేవినేని ఉమ ప్రభుత్వ అరాచకాలను, దుర్మార్గ పాలనను ప్రశ్నించే గొంతులపై నాన్ బెయిలబుల్ కేసులు పెడతారా అని మండిపడ్డారు. తిరుపతిపై జగన్ అంతరంగాన్ని బయటపెడితే తనపై సీఐడీ కేసు నమోదు చేస్తుందా అంటూ ఫైర్ అయ్యారు. ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేది లేదని , గొంతులో ఊపిరి ఉన్నంతవరకు పోరాడుతూనే ఉంటామని అన్నారు.