కేసీఆర్ తో సినీ పెద్దల భేటి..ఇదే ఎజెండా!

Update: 2020-05-22 11:10 GMT
నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తో చర్చించిన టాలీవుడ్ సినీ పెద్దలు తాజాగా ఈరోజు ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటి కాబోతున్నారు. ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలకు లోబడి సినిమా షూటింగ్ లు చేసుకోవడం.. థియేటర్లు తెరవడంపై ఆయనతో చర్చించనున్నారు.

ఇప్పటికే సినిమా పెద్దలు లేవనెత్తిన సమస్యలపై నిన్న మంత్రి తలసాని శ్రీనివాస్.. సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. ఇదే విషయాలపై ఈరోజు కేసీఆర్ తో సినీ పెద్దలు చర్చించనున్నారు.

సినీ పెద్దలు ప్రధానంగా కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చే అంశాలు  ఇవేనని తెలుస్తోంది. ప్రధానంగా థియేటర్లలో సోషల్ డిస్టేన్స్ పాటిస్తూ సీట్లను కేటాయించి ప్రదర్శనలు చేస్తామని.. వాటికే ట్యాక్స్ కట్టేలా చూడాలని కోరనున్నారు. ఇక షూటింగ్ లకు ఇతర రాష్ట్రాల్లో అనుమతులు లేనందున ఇక్కడ ఉన్న లోకేషన్ లలో షూటింగ్ చేసుకునేందుకు కొంత రాయితీ ఇవ్వాలని కేసీఆర్ ముందు ప్రతిపాదన ముందుంచనున్నారు.

ఇక రిలీజ్ కాబోయే సినిమాలకు పన్ను రాయితీని సినీ ప్రముఖులు కోరనున్నారు. ఇక షూటింగ్ లు మొదలు పెడితే పరిమిత సంఖ్యలో 50 మందితో ఇన్ డోర్ - ఔట్ డోర్ షూటింగ్ లు ఎలా చేస్తామన్నది ప్రజంటేషన్ రూపంలో సీఎంకు సమర్పించనున్నారు.

ఇప్పటికే సీఎం కేసీఆర్ తో భేటి అయ్యేందుకు ప్రగతి భవన్ కు మెగాస్టార్ చిరంజీవి - నాగార్జున - రాజమౌళి - త్రివిక్రమ్ - ఎన్.శంకర్ - అల్లు అరవింద్ - దిల్ రాజు - రాధాకృష్ణ - సీ కళ్యాణ్ - సురేష్ బాబు - కొరటాల శివ తదితరులు వెళ్లారు. కేసీఆర్ ఏం వరాలు సినిమా ఇండస్టీకి ఇస్తాడన్నది ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News