టెక్నాలజీ ఎంతగా విస్తరిస్తుంటే.. మోసాలు కూడా అంతగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్లో జరుగుతున్న మోసాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఇందులో సినీ ప్రముఖుల సంఖ్య కూడా పెరుగుతుండడం గమనార్హం. అవసరమో.. అవగాహనా లోపమోకానీ.. నేరుగా వెళ్లి సైబర్ నేరగాళ్లకు బుక్కైపోతున్నారు.
ఆ మధ్య.. ఛలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు వెంకీ కుడుముల సైతం ఆన్ లైన్ మోసానికి గురయ్యారు. ఓ అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్ట్ నిర్వహిస్తున్నామని, ఈ పోటీలకు ‘భీష్మ’ సినిమాను నామినేట్ చేస్తామంటూ కాల్ చేశారు. ఆరు కేటగిరీల్లో చిత్రాన్ని నామినేట్ చేస్తామని, కేటగిరీకి 11 వేల రూపాయల చొప్పున రూ.66 వేలు డిపాజిట్ చేయాలని తీసుకున్నాడు. ఆ తర్వాత మళ్లీ డబ్బులు అడగడంతో.. అప్పుడు విషయం అర్థమైంది మన డైరెక్టర్ కు!
ఇటీవలే.. ప్రముఖ సినీ నిర్మాత డి. సురేష్ బాబు సైతం ఆన్ లైన్ మోసానికి గురయ్యారు. త్వరలో షూటింగులు ఓపెన్ కాబోతున్న నేపథ్యంలో.. యూనిట్లో ఎవరూ కరోనా బారిన పడకుండా.. సిబ్బందికి వ్యాక్సిన్ వేయించేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ వ్యక్తి తన వద్ద వ్యాక్సిన్లు ఉన్నాయని చెప్పాడట. ఇది నిజమేనని నమ్మిన సురేష్ బాబు మేనేజర్.. అగంతకుడికి అడ్వాన్సుగా ఏకంగా లక్ష రూపాయలు ట్రాన్స్ ఫర్ చేశాడు. వ్యాక్సిన్ ఇవ్వకపోవడం.. ఎన్ని సార్లు ఫోన్ చేసినా.. లిఫ్ట్ చేయకపోవడంతో మోసపోయినట్టు గుర్తించారు.
తాజాగా.. ప్రముఖ బాలీవుడ్ నటి షబానా అజ్మీ కూడా ఇదే తరహాలో మోసపోయారు. ఆన్ లైన్ ద్వారా ఆమె మద్యం ఆర్డర్ చేశారు. దానికోసం మనీ కూడా ట్రాన్స్ ఫర్ చేశారు. కానీ.. ఎంతసేపటికీ మద్యం డెలివరీ కాలేదు. ఏమైందని ఫోన్ చేస్తే.. రెస్పాన్స్ లేదు. దీంతో.. తాను మోసపోయినట్టు ఆమె గుర్తించారు. ఈ విషయాన్ని స్వయంగా సోషల్ మీడియాలో వెల్లడించారు షబానా.
ఈ విధంగా.. ఆన్ లైన్ లో మోసపోయేవారికి కేటగిరీలు ఏమీ లేవు. అప్రమత్తంగా లేకపోతే.. ఎవ్వరి డబ్బులైనా సమర్పించడమే అనే పరిస్థితులు వచ్చేశాయి. సో.. బీ కేర్ ఫుల్. అంతా ఓకే అనుకున్న తర్వాత ఆన్ లైన్ పేమెంట్ కు ఓకే కొట్టండి. లేదంటే.. ఆ తర్వాత నెత్తీనోరు బాదుకోవాల్సి వస్తుంది.