కేంద్రంలోని బీజేపీ సర్కార్ వచ్చాక కార్పొరేట్లు లాభపడ్డారని ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి. అందునా ప్రధాని మోడీ రాష్ట్రానికి చెందిన అంబానీలు, అదానీలు ప్రపంచంలోనే కోటీశ్వరులుగా ఎదిగారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తుంటారు. తాజాగా ఓకార్పరేట్ సంస్థ కేంద్ర రక్షణ శాఖ భద్రత కల్పించడం అందరినీ షాక్ కు గురిచేసింది.
సాధారణంగా ప్రజల ఆస్తులకు, ప్రభుత్వ ఆస్తుల రక్షణకు సీఐఎస్ఎఫ్ భద్రత కల్పించడం ఆనవాయితీగా వస్తోంది. ఇక ఎయిర్ పోర్టులు, షిప్ యార్డులు, రైల్వే స్టేషన్లు, కీలకమైన ప్రభుత్వ కార్యాలయాలు తదితరులకు ప్రభుత్వ భద్రత కల్పించడం జరుగుతోంది. కానీ ఒక ప్రైవేటు వ్యాపారసంస్థకు ప్రభుత్వానికి చెందిన భద్రతా దళాలను ఉపయోగించడం ఇదే తొలిసారి కావడం అందరినీ ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.
దేశంలోనే అపర కుబేరుడు అయిన ముఖేష్ అంబానీకి చెందిన ముంబైలోని రిలయన్స్ జియో వరల్డ్ సెంటర్ కు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) దళాలతో భద్రత కల్పించింది కేంద్రప్రభుత్వం. ఈ వాణిక్య వినోద కేంద్రానికి 200 మంది దళాలతో సెక్యూరిటీ ఇచ్చేందుకు కేంద్రం డిసైడ్ అయ్యింది.
ఉగ్రవాద, విధ్వంసకర శక్తుల నుంచి జియో సెంటర్ కు ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల సమాచారం మేరకు జియో సెంటర్ కు సెక్యూరిటీ కల్పించామని కేంద్రం చెబుతోంది. సహజంగా ప్రైవేటు సంస్థలకు ప్రభుత్వ దళాలు రక్షణ కల్పించవు. అవే సెక్యూరిటీ సమస్యలు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేసుకుంటాయి. అంతేకానీ దేశ రక్షణలో కీలకమైన సీఐఎస్ఎఫ్ భద్రతా దళాలను ప్రైవేటు సంస్థకు సెక్యూరిటీగా పెట్టడం విమర్శలకు తావిస్తోంది.
ప్రతిపక్షాలు, వీఐపీలకు సెక్యూరిటీ తగ్గిస్తున్న కేంద్ర ప్రభుత్వం ఒక ప్రైవేటు కార్పొరేట్ సంస్థకు హైసెక్యూరిటీ కల్పించడం విమర్శలకు తావిస్తోంది. ముంబైలోని ముఖేష్ అంబానీ నివాస ముందు అనుమానితులు తచ్చాడి ఆయన హత్యకు కుట్ర జరుగుతుందన్న ఆరోపణల నేపథ్యంలోనే ఈ సెక్యూరిటీ కల్పించినట్టు సమాచారం.