సీజేఐ ఎన్వీ రమణ కల నెరవేరింది

Update: 2021-08-20 17:30 GMT
కంపెనీల వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని (ఆర్బిటేషన్ సెంటర్) ఏర్పాటు చేయడంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ హర్షం వ్యక్తం చేశారు.  తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు.

ఈ సందర్భంగా సీజేఐ ఎన్వీ రమణ మాట్లాడుతూ  హైదరాబాద్ లో ఆర్బిట్రేషన్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన కల అన్నారు. పెట్టుబడిదారులో స్నేహపూర్వక వాతావరణాన్ని సృష్టించడానికి ఈ అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కేంద్రం సులభతరం చేసిందని ఆయన చెప్పారు. మూడు నెలల్లోనే తన కల నిజమైందని చెప్పిన సీజేఐ దీనికోసం కృషి చేసిన తెలంగాణ సీఎం కేసీఆర్, జస్టిస్ హిమా కోహ్లీకి కృతజ్ఞతలు తెలిపారు.

కంపెనీల వాణిజ్య వివాదాలను పరిష్కరించడానికి హైదరాబాద్ లో అంతర్జాతీయ మధ్యవర్తిత్వ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం మొదటి అడుగు. ప్రస్తుతం కంపెనీలు తమ అంతర్జాతీయ వాణిజ్య వివాదాలను పరిష్కరించుకోవడానికి సింగపూర్ పై ఆధారపడి ఉన్నాయి.

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ హిమా కోహ్లీ నివాసంలో అంతర్జాతీయ మధ్యవర్తిత్వం కేంద్రం కోసం ట్రస్ట్ డీడ్ నమోదు చేశారు. మొదటి అంతర్జాతీయ ఆర్బ్రిట్రేషన్  సెంటర్  1926లో ప్రారంభమైంది.  ప్రస్తుతం కంపెనీలు మధ్యవర్తిత్వం కోసం సింగపూర్, దుబాయ్ పై ఆధారపడి ఉన్నాయి. ఇప్పుడు పరిస్థితి మారుతోంది అంతర్జాతీయ మధ్యవర్తులు విభేదాలను పరిష్కరించడానికి హైదరాబాద్ వస్తారు.  మూడు నెలల క్రితం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఈ సెంటర్ ఏర్పాటుకు బాధ్యత తీసుకోవాలని జస్టిస్ నాగేశ్వరావును కోరగా ఆయన మూడు నెలల్లోనే ఈ కోరికను నెరవేర్చడంపై సీజేఐ రమన సంతోషం వ్యక్తం చేశారు.
Tags:    

Similar News