చిత్తూరు ఎమ్మెల్యేకు సంక‌ట ప‌రిస్థితి?

Update: 2018-08-23 12:42 GMT
రాబోయే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఏపీలో పొలిటిక‌ల్ వార్ మొద‌లైంది. ఏపీ పొలిటిక‌ల్ స్క్రీన్ మీద త‌మ స‌త్తా చాటేందుకు తాజా, మాజీ నేత‌లంతా సిద్ధ‌మ‌వుతున్నారు. 2019లో గెలుపే ప‌ర‌మావ‌ధిగా అస్త్ర శ‌స్త్రాలు సిద్ధం చేస్తున్నారు. అయితే, చిత్తూరు జిల్లాలోని ఓ మాజీ ఎమ్మెల్యేకు సంక‌ట ప‌రిస్థితి ఎదురైంద‌ట‌. 2019లో చిత్తూరులో జ‌ర‌గ‌బోతోన్న నాలుగు స్తంభాలాట‌లో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన సీకే బాబుకు కొత్త చిక్కు వ‌చ్చి ప‌డిందట‌. ప్ర‌స్తుతం బీజేపీ నేత‌గా ఉన్న బాబు...ఆ పార్టీకి గుడ్ బై చెప్పి....వైసీపీలోకి రావాల‌ని ఆయ‌న అనుచ‌ర గ‌ణం ఒత్తిడి చేస్తోంద‌ట‌. అయితే, ఇప్ప‌టికే వైసీపీలో చ‌క్రం తిప్పుతోన్న పెద్దిరెడ్డి రామ‌చంద్రా రెడ్డితో బాబుకున్న రాజ‌కీయ వైరం కార‌ణంగా ఆయ‌న ఎంట్రీ అంత సులువు కాద‌ని టాక్. మ‌రోవైపు, టీడీపీలోకి వెళ్లాల‌ని ఉత్సాహం చూపినా....అటునుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాలేద‌ట‌. దీంతో, ఎటూ తేల్చుకోలేని సందిగ్దంలో ఉన్నార‌ట‌.

చిత్తూరులో ని మాస్ లీడ‌ర్స్ లో సీకే బాబు ఒకరు. చిత్తూరు నుంచి 4 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి బాబు...వైఎస్ రాజ శేఖ‌ర్ రెడ్డికి స‌న్నిహితుడు. అయితే, 2014 ఎన్నిక‌ల‌కు నెల ముందు వైసీపీలోచేర‌డంతో ఆయ‌నకు టికెట్ ద‌క్క‌లేదు. దీంతో, టీడీపీలో చేర‌దామ‌ని ప్ర‌య‌త్నించినా....ఎన్టీఆర్ భ‌వ‌న్ నుంచి గ్రీన్ సిగ్న‌ల్ రాక‌పోవ‌డంతో సైలెంట్ అయిపోయారు. దీంతో, పురంధేశ్వ‌రి చొర‌వ‌తో బీజేపీలో చేరారు. అయితే, ప్ర‌స్తుతం ఏపీలో బీజేపీ కి వ్య‌తిరేక‌త ఉండ‌డంతో ....పార్టీ మారాల‌ని క్యాడ‌ర్ ఒత్తిడి చేస్తోంద‌ట‌. వైసీపీలోకి వెళ్లాల‌ని క్యాడ‌ర్ సూచిస్తున్న‌ప్ప‌టికీ....పెద్ది రెడ్డి నుంచి ఆయ‌న‌కు వ్య‌తిరేక‌త త‌ప్ప‌డం లేద‌ట‌. దీంతో, పెద్ది రెడ్డి త‌నకు సృష్టిస్తోన్న అడ్డంకుల‌ను తొల‌గించుకుని వైసీపీలోకి చేరాల‌ని ప్లాన్ చేస్తున్నార‌ట‌. మ‌రోవైపు, బాబు పార్టీ వీడి వెళ్ల‌ర‌ని బీజేపీ ధీమాగా ఉంద‌ట‌. మ‌రి, 2019లో బాబు దారెటు అన్న విష‌యం ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News