కొవాగ్జిన్ బూస్టర్ డోస్ ఎప్పుడు తీసుకోవాలంటే..?

Update: 2021-11-11 04:30 GMT
కరోనా మహమ్మారి కట్టడికి వ్యాక్సినేషన్ మాత్రమే శక్తివంతమైన అస్త్రమని వైద్యారోగ్య నిపుణులు చెబుతూనే ఉన్నారు. దేశంలో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైన తర్వాతే పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. అయితే తొలిత టీకాపై ఎంతోమందికి అనేక అపోహలు కలిగాయి. చాలామంది వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనుకడుగేశారు. ఆ తర్వాత ఫ్రంట్ లైన్ వారియర్లు చకాచకా వ్యాక్సిన్ తీసుకోవడం, సెకండ్ వేవ్ ఉద్ధృతితో టీకా తీసుకోవడానికి జనాలు నెమ్మదిగా ఆసక్తి చూపారు. అయితే ప్రస్తుతం కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాలు రెండు డోసులు తీసుకోవాల్సి వస్తోంది. మొదటి డోసు తర్వాత నిర్దేశించిన సమయంలో రెండో మోతాదు తీసుకుంటున్నారు. కాగా బూస్టర్ డోసుపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే కొవాగ్జిన్ బూస్టర్ డోస్ పై క్లారిటీ వచ్చింది.

మనదేశానికి చెందిన భారత్ బయోటెక్ సంస్థ కొవాగ్జిన్ ను అభివృద్ధి చేసింది. దేశీయంగా తయారైన ఈ టీకా ప్రస్తుతం రెండు డోసులు తీసుకోవాల్సి వస్తోంది. అయితే బూస్టర్ డోసు కాలపరిమితిపై ఆ సంస్థ సీఎండీ కృష్ణ ఎల్ల క్లారిటీ ఇచ్చారు. కొవాగ్జిన్ రెండు డోసులు పూర్తయిన ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలని ఆయన తెలిపారు. అదే అనువైన సమయం అని పేర్కొన్నారు. ఇకపోతే బూస్టర్ డోసుకు నాజల్ టీకాను అందుబాటులోకి తీసుకొస్తామని వెల్లడించారు. ముక్కు ద్వారా వేసే టీకాను బూస్టర్ డోసుగా అందుబాటులోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నట్లు ఆయన చెప్పారు. కొవాగ్జిన్ తో పోలిస్తే నాజల్ టీకాను తయారు చేయడం చాలా సులభమని చెప్పారు. ఈ మేరకు ముక్కుద్వారా ఇచ్చే టీకా గురించి ఆయన వివరించారు. ప్రపంచదేశాలు కూడా నాజల్ టీకాపై ఆసక్తి చూపుతున్నాయని ఈ సందర్భంగా వెల్లడించారు.

జికా వైరస్ కు కూడా ప్రపంచంలోనే తొలిసారిగా టీకా అభివృద్ధి చేసినట్లు ఆయన వెల్లడించారు. జికా వైరస్ కు టీకాను తయారు చేశామని తెలిపారు. మొదటి దశ క్లినికల్ ట్రయల్స్ కూడా పూర్తయ్యాయని ఈ సందర్భంగా ప్రకటించారు. ఇకపోతే మరిన్ని ట్రయల్స్ కు అనుమతులు ఇవ్వాలని కోరారు. ప్రస్తుతం జికా కేసులు పెరుగుతున్నాయని ఆయన చెప్పారు. కొవాగ్జిన్, నాజల్ టీకా, జికా టీకాపై భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా వివరించారు.

కొవాగ్జిన్ ను తాజాగా హాంకాంగ్ ప్రభుత్వం గుర్తించింది. కొవిడ్ వ్యాక్సిన్ల లిస్టులో ఈ టీకాను చేర్చింది. కాగా కొవాగ్జిన్ అత్యవసర వినియోగానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవలె ఆమోదం తెలిపింది. కాగా ఇప్పటికే ఈ టీకాను 96 దేశాలు గుర్తించాయి. ఆ దేశాలకు వెళ్లడానికి భారతీయులకు కొవిడ్ ఆంక్షల నుంచి మినహాయింపు ఉంటుందని కేంద్ర ఆరోగ్య మంత్రి ఇటీవలె ప్రకటించారు. పైగా కొవాగ్జిన్, కొవిషీల్డ్ లు మనదేశంలో తయారు కావడం గర్వకారణమని ఆయన కొనియాడారు. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోందని వెల్లడించారు. ఇకపోతే మహమ్మారిని ఎదుర్కొవడానికి ఏకైక మార్గం వ్యాక్సినేషన్ మాత్రమేనని వైద్యారోగ్య నిపుణులు చెబుతున్న విషయం తెల్సిందే.


Tags:    

Similar News