రావయ్యా... రజినీకాంత్ అని ఆయన అభిమానులు.. తమిళ ప్రజలు.. తోటి సినీ కళాకారులు కోరుతున్నా తీవ్ర జాప్యం చేస్తున్న రజినీకాంత్ ఎట్టకేలకు పెట్టాబేడా సర్దేసి తమిళ రాజకీయాల్లోకి రాబోతున్నాడని ఆయనకు అత్యంత సన్నిహితుడు స్పష్టం చేశాడు.
అమ్మ జయలలిత మరణంతో ఖాళీ అయిన తమిళ పాలిటిక్స్ లో ఆమెను భర్తీ చేసే రాజకీయ నేత లేక లోటు కనిపిస్తోంది. ఈ క్రమంలో రజినీకాంత్ రాజకీయాల్లోకి రావాలనే డిమాండ్ అందరినుంచి ఉంది. కానీ ఆయన మాత్రం రావడానికి తటపటాయిస్తున్నాడు.
తాజాగా సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయ అరంగేట్రం ఈ ఏడాదిలో చేయబోతున్నాడని.. ఆయనకు అత్యంత సన్నిహితుడు కరాటే తియగరాజన్ తెలిపాడు. తియగరాజన్ గతంలో చెన్నై నగర డిప్యూటీ మేయర్ గా వ్యవహరించారు. రజీనీకాంత్ కు దగ్గరి స్నేహితుడు..
తొలుత మార్చి 12వ తేదీన పార్టీని ప్రారంభిద్దామని రజినీకాంత్ భావించారని.. అయితే అప్పటికే దేశంలో కరోనా ఎంట్రీ కావడంతో రజినీకాంత్ వాయిదా వేశారని తియగరాజన్ తెలిపారు. ఇక ఆగస్టులో పార్టీని లాంచ్ చేద్దామని చూసినా ప్రస్తుతం కరోనా తగ్గే పరిస్థితి లేకపోవడంతో మరోసారి వాయిదా వేశాడని తెలిపారు.
ఈ నవంబర్ లో మాత్రం రజినీకాంత్ ఖచ్చితంగా పార్టీ ప్రారంభిస్తాడని తియగరాజన్ ఓ జాతీయ చానెల్ తో మాట్లాడుతూ తాజాగా స్పష్టం చేశారు.దీంతో హమ్మయ్య అని ఆయన అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.