గంటా క్లారిటీ ఇచ్చేశారా... ?

Update: 2022-01-11 23:30 GMT
విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజకీయం ఎటు వైపు. ఆయన పయనం ఏ వైపు. ఇది జోరుగా సాగుతున్న చర్చ. గంటా రూట్ క్లియర్ అయిరే విశాఖ జిల్లా రాజకీయాల్లో ఒక స్పష్టమైన పిక్చర్ వస్తుంది. గంటా ప్రతీ ఎన్నికకూ పార్టీని మారుస్తారు అన్న విమర్శలకు 2019 ఎన్నికల్లో ఫుల్ స్టాప్ పెట్టేశారు. ఆయన అప్పటిదాకా తానున్న పార్టీ నుంచే పోటీ చేశారు. అయితే యధా ప్రకారం నియోజకవర్గాన్ని మాత్రం మార్చారు, ఆ సెంటిమెంట్ తో గెలిచారు కూడా.

అయితే 2024 ఎన్నికలకు గంటా పార్టీని, సీటుని కూడా మారుస్తారు అని చాలా కాలంగా ప్రచారం సాగుతోంది. అయితే రీసెంట్ గా గంటా కాపులకే సీఎం పదవి అంటూ కొంత హడావుడి చేస్తున్నారు. కాపు నేతలతో ఆయన వరస భేటీలు పెడుతున్నారు. దాంతో గంటా ప్లాన్ ఏంటి అన్నది తెలియక తెలుగుదేశం పార్టీతో పాటు వైసీపీ కూడా ఆయన వైపు ఆసక్తిగా చూస్తున్నాయి.

ఇవన్నీ ఇలా ఉంటే గంటా సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఆయన ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీని విడిచి వెళ్ళరని అంటున్నారు. ఏపీలో వైసీపీ అధికారంలో ఉంది. ఆ పార్టీలో ఆయన చేరుతారు అని మొదటి రెండేళ్ళలో ఊహాగానాలు బాగా వినిపించినా ఇపుడు ఆ ఊసే లేసు. ఆ మధ్య గంటా బీజేపీలోకి వెళ్తారు అని కూడా అన్నారు. ఇక ఈ మధ్య ఆయన జనసేన వైపు చూస్తున్నారు అని కూడా ప్రచారం మొదలైంది.

అయితే గంటా తానున్న చోటనే బాగుందని గట్టిగా డిసైడ్ అయ్యారట. ఆయనకు చంద్రబాబుతో ఎలాంటి గ్యాప్ కూడా లేదని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది అన్న లెక్కలు కూడా గంటా వద్ద ఉన్నాయట. అందువల్ల ప్రతీ ఎన్నికకూ ఒక పార్టీ అంటూ తన మీద వస్తున్న విమర్శలకు ఈసారి శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.

పైగా తెలుగుదేశం పార్టీలో ఉంటేనే తనకు అన్ని విధాలుగా రాజకీయం బాగుంటుంది అని ఆయన భావిస్తున్నారుట. విశాఖ సహా ఉత్తరాంధ్రా జిల్లాల్లో గంటాకు పెద్ద ఎత్తున అనుచర గణం ఉంది. అలాగే గోదావరి జిల్లాల నుంచి నెల్లూరులో వియ్యంకుడు, మాజీ మంత్రి నారాయణ వంటి వారు కూడా టీడీపీలో మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. దీంతో ఈ పరిణామాలను బట్టి చూస్తూంటే గంటా సైకిల్ ని ఎట్టి పరిస్థితుల్లో దిగబోరు అని అంటున్నారు

ఈ మధ్య గంటా టీడీపీ చేపడుతున్న కార్యక్రమాలకు బాగానే రియాక్ట్ అవుతున్నారు. టీడీపీ క్యాడర్ తో మళ్ళీ గంటా క్యాంప్ ఆఫీస్ హడావుడిగా ఉంది. దాంతో గంటా పక్కా క్లారిటీతోనే ఉన్నారని అంటున్నారు. అయితే ఆయన ఈసారి పోటీ చేసే నియోజకవర్గంలోనే మార్పులు ఉంటాయని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Tags:    

Similar News