ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీలో ఆధిపత్య పోరు ఒకరి హత్యకు దారితీసింది. పార్టీ కార్యకర్తల ఘర్షణలో ఒక వైసీపీ కార్యకర్త హత్యకు గురయ్యాడు. సొంత పార్టీ నేతలే అతడిని చంపడం కలకలం రేపింది.
కడప జిల్లాలో వైసీపీ వర్గీయుల మధ్య వర్గ విభేదాలు చోటుచేసుకున్నాయి. వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డిల మధ్య ఆధిపత్య పోరులో ఓ కార్యకర్త దారుణహత్యకు గురయ్యాడు. కొండాపురం మండలం పింజి అనంతపురంలో ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రామసుబ్బారెడ్డి వర్గీయుల మధ్య జరిగిన ఈ ఘర్షణలో రామసుబ్బారెడ్డి వర్గానికి చెందిన గురునాథ్ రెడ్డి మరణించాడు.
కడప జిల్లా కొండాపురం మండలంలోని పింజి అనంతపురంలో గల గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారం విషయంలో ఈ వివాదం చోటుచేసుకుంది. గండికోట ప్రాజెక్ట్ ముంపు పరిహారంలో అనర్హులు ఉన్నారంటూ గురునాథ్ రెడ్డి అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై విచారణ కోసం గ్రామసభ నిర్వహించగా.. వైసీపీకి చెందిన మరో వర్గం గురునాథ్ రెడ్డితో గొడవకు దిగింది. రాడ్లు, రాళ్లతో దాడు చేయడంతో గురునాథ్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురునాథ్ రెడ్డి ప్రాణాలు వదిలాడు.
వైసీపీ కార్యకర్త దారుణ హత్యతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు గ్రామాన్ని అదుపులోకి తీసుకొని పికెటింగ్ ఏర్పాటు చేశారు.