రాజకీయపార్టీల మధ్య విభేధాలు సహజమే.... ఒక్కోసారి ఇవి నివురుగప్పిన నిప్పులా ఉంటాయి... అప్పుడప్పుడు పేపర్లు - టీవీలకు ఎక్కి అందరికీ తెలుస్తాయి. తాజా మీడియా కంటే సోషల్ మీడియా పవర్ పెరగడంతో రాజకీయ రచ్చ పోషల్ మీడియాలోనే ముందుగా ఫ్లాష్ అవుతోంది. తాజాగా టీడీపీ - బీజేపీ నేతల మధ్య విభేదాలకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో తెగ షేర్ అవుతుండడంతో పాటు చర్చకు దారితీస్తోంది.
కేంద్రం - ఏపీలోని ప్రభుత్వాల్లో ఉన్న టీడీపీ - బీజేపీల మధ్య ఏపీలో విభేదాలు తీవ్ర స్థాయిలో ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ బీజేపీ నేతలు - టీడీపీ నేతలూ తరచూ ఒకరిపై ఒకరు తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటున్నారు. అలాంటి సందర్భాల్లో బీజేపీ నుంచో, టీడీపీ నుంచో పెద్దలు జోక్యం చేసుకుని చల్లారుస్తున్నారు. అయితే... ఇటీవల పశ్చిమగోదావరి జిల్లాలో మాత్రం టీడీపీ - బీజేపీ నేతల మధ్య చోటుచేసుకున్న తీవ్ర వివాదం సోషల్ మీడియాలోకెక్కి బయటకొచ్చింది.
వెస్టు గోదావరిలో జరిగిన ఓ కార్యక్రమంలో అక్కడి జడ్పీ చైర్మన్ - టీడీపీ నేత బాపిరాజు - ఏపీమంత్రివర్గంలో ఉన్న బీజేపీ నేత పైడికొండల మాణిక్యాలరావు మధ్య గొడవ జరిగింది. బాపిరాజు మాణిక్యాలరావుపై ఫుల్ రేంజిలో ఫైరయ్యారు. ఇద్దరూ మాటామాటా అనుకున్నారు. ఆ సమయంలో అక్కడున్న టీడీపీ మంత్రి ఇద్దరికీ సర్ది చెప్పి సముదాయించారు. కానీ, ఈ సీనంతటినీ ఫోన్ లో వీడియో తీసిన ఓ టీడీపీ నేత దాన్ని ఫేస్ బుక్ లో పెట్టేసరికి విషయం బయటకొచ్చేసింది.
Full View