తెలుసుకోవాల్సిన తెలంగాణ అంకెలు..

Update: 2017-03-14 04:30 GMT
కొన్ని విషయాల్ని గుర్తు ఉంచుకున్నా.. లేకున్నా పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదు. కానీ.. కొన్ని విషయాల్లో మాత్రం అలాంటి పరిస్థితి అస్సలు ఉండదు. కచ్ఛితంగా తెలుసుకొని తీరాల్సిందే. అలాంటి కోవలోకే చెందుతాయి ఇప్పుడు మేం చెప్పబోయే అంకెలు. తెలంగాణ గురించి మరింత అవగాహన పెంచుకోవాలన్నా.. పాలక పక్షం..రాజకీయ పార్టీల మాటలు పూర్తిగా అర్థం కావాలన్నా..వారి రాజకీయం ఇట్టే అర్థం కావాలన్నా అప్డేట్ కావాల్సిన గణాంకాలుగా వీటిని చెప్పక తప్పదు. ఓటు బ్యాంకు రాజకీయాల నేపథ్యంలో మతాలు.. కులాల వారీ లెక్కలు తప్పనిసరి.అంతేనా.. పాలకులు చెప్పే మాటల్లో నిజాల లెక్క ఎంతన్న విషయాన్ని కొన్ని అంకెలు ఇట్టే అర్థమయ్యేలా చేస్తుంటాయి. అలాంటి వాటి విషయానికి వస్తే..

తెలంగాణలో ఎవరెంత మంది అన్నది చూస్తే..

జనాభా              3.50కోట్లు

పురుషులు          1.76కోట్లు

స్త్రీలు                  1.73కోట్లు

గ్రామాల్లో జనాభా    2.13కోట్లు

పట్టణాల్లో జనాభా   1.36కోట్లు

హిందువులు           2,99,48,451

ముస్లింలు                 44,64,699

క్రైస్తవులు                    4,47,124

బౌద్దులు                       32,553

సిక్కులు                       30,340

జైనులు                        26,690

ఇతరులు                        5,422

ఏ మతానికీ చెందని వారు 2,38,699                                                                

తెలంగాణలో..

పట్టణాలు                  158

గ్రామ పంచాయితీలు   8,687

రెవెన్యూ గ్రామాలు     10,434

తలసరి ఆదాయం లెక్కలోకి వెళితే..

టాప్ ఫైవ్ జిల్లాలు

హైదరాబాద్   రూ.2,99,997

రంగారెడ్డి      రూ.2,88,408

సంగారెడ్డి      రూ.1,69,481

మేడ్చల్       రూ.1,62,327

భద్రాద్రి         రూ.1,23,112

అత్యల్ప ఐదు జిల్లాలు (టాప్ లో ఫైవ్ జిల్లాలు)

జగిత్యాల            రూ.77,669

కామారెడ్డి           రూ.78,853

వరంగల్ అర్బన్    రూ.79,753

నాగర్ కర్నూలు    రూ.81,147

వనపర్తి              రూ.83,196

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News