సినిమాల ప్రభావం జనాల మీద ఉందంటే ఓకే అనే సినీ ప్రముఖులు.. ఏదైనా దరిద్రపు లక్షణాలకు కారణం సినిమా అంటే మాత్రం నో అంటే నో అనేస్తుంటారు. సినిమా ప్రభావం ఎందుకు ఉంటుంది? చెడును ఎందుకు స్ఫూర్తిగా తీసుకోవాలి.. మంచిని తీసుకోవచ్చుగా అంటూ సొల్లు వాదన వినిపిస్తారే కానీ.. తమకున్న బాధ్యత గురించి అస్సలు మాట్లాడరు. దారి తప్పేలా తీసిన సినిమాలను విమర్శించే పని అస్సలు చేయరు. ఇలాంటి తీరుతోనే దరిద్రపు సినిమాలు అంతకంతకూ పెరుగుతూ.. కొత్త తరహా వెర్రితలలకు తెర తీస్తున్నాయి. తాజాగా అలాంటి ఉదంతాన్ని బయపెట్టారు పోలీసులు.
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన జగిత్యాల విద్యార్థుల సూసైడ్ మిస్టరీ వీడింది. అందరూ అనుమానిస్తున్నట్లుగా ఈ కుర్రాళ్లది హత్య ఎంతమాత్రం కాదని.. వీరిది సూసైడ్ అని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు.
ఈ కుర్రాళ్లు ఇద్దరూ ఇలా ఆత్మహత్యకు ప్రేరేపించింది మాత్రం.. ఈ మధ్యన విడుదలైన ఒక పాడు సినిమాగా తిట్టిపోస్తున్నారు. ఈ మధ్యన విడుదలైన ఆర్ ఎక్స్ 100 సినిమా తరహాలో తాము వేర్వేరుగా ప్రేమించిన అమ్మాయిలు మోసం చేశారన్న భావనతో రవితేజ..మహేందర్ లు ఈ ఆఘాయిత్యానికి పాల్పడినట్లుగా చెబుతున్నారు. ఆర్ ఎక్స్ 100 సినిమాలో కొన్ని సన్నివేశాలే వారిని ప్రభావితం చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు.
ఇద్దరు కుర్రాళ్లు తమ స్కూల్లో చదివే అక్కా చెల్లెళ్లతో ప్రేమ వ్యవహారం సాగించారు. ఈ విషయం తెలిసిన అమ్మాయి పేరెంట్స్ రవితేజ.. మహేందర్ లను మందలించారు. అయినా పట్టకుండా వారం క్రితం వారు మళ్లీ అమ్మాయిల ఇంటివైపు వెల్లటంతో వార్నింగ్ ఇచ్చారు. దీంతో తమ ప్రేమ విఫలమైందని భావించారు. ఆదివారం మధ్యాహ్నం మరోసారి ఇంట్లో నుంచి బయటకు వచ్చి.. మరోసారి అమ్మాయిల ఇళ్లవైపు వెళ్లగా.. వారి తండ్రి మహేందర్ కు ఫోన్ చేసి మందలించారు.
దీంతో.. మనస్తాపానికి గురైన వారిద్దరూ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొనుక్కొని.. అనంతరం మద్యం సేవించి ఒకరిపై ఒకరు పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారని పోలీసులు చెబుతున్నారు. పెట్రోల్ కొనుగోలు చేసిన సీసీ కెమేరా ఫుటేజ్ దొరికినట్లుగా తెలుస్తోంది. మొత్తంగా ఒక సినిమా ఎంత ప్రభావం చూపిస్తుందని చెప్పటానికి తాజా ఉదంతం పెద్ద ఉదాహరణగా చెప్పక తప్పదు.