ఇచ్చినోళ్లకు తిరిగి ఇవ్వటం సంస్కారం. అది మనిషిలో అంతకంతకూ తరిగిపోతున్న వేళ.. ప్రకృతి చేసిన ఉపకారానికి అంతకు రెట్టింపు అపకారం చేసిన మనిషి అందుకు భారీ మూల్యం చెల్లించనున్నారా? అంటే అవునని చెబుతున్నారు. భూమి మీద మనుషులు అట్టే కాలం మనుగడ సాధించే అవకాశం లేదని.. పర్యావరణ మార్పుల కారణంగా ప్రపంచ జనాభాలో 90 శాతం మంది రానున్న 30 ఏళ్లలో తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం పొంచి ఉందంటున్నారు.
ఆస్ట్రేలియాకు చెందిన బ్రేక్ త్రూ నేషనల్ సెంటర్ ఫర్ క్లైమేట్ రీస్టోరేషన్ సంస్థ తాజా అధ్యయనం ప్రకారం పర్యావరణ మార్పులపై ఐక్యరాజ్యసమితి నేతృత్వంలోని ప్యానల్ ఏమీ చేయట్లేదన్న ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తోంది. వాతావరణంలో కర్బన ఉద్గారాల స్థాయిలు ఆందోళనకర స్థాయిలో పెరిగిపోవటంతో.. భూమి మీద ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరిగిన వైనాన్ని ప్రస్తావించారు.
వివిద దేశాలతో కూడిన ప్యానల్ పర్యావరణం విషయంలో ఏమీ చేయట్లేదన్న అసంతృప్తిని వ్యక్తం చేసిన సంస్థ.. పెరిగిన ఉష్ణోగ్రతల్ని తక్కువ చేసి చూపిస్తున్నట్లుగా ఆరోపించింది. పర్యావరణంలో చోటు చేసుకుంటున్న మార్పుల కారణంగా 30 ఏళ్లల్లోనే మానవాళిలోని 90 శాతం మంది మనుషులు అంతరించిపోయే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
పారిస్ ఒప్పందంలో పేర్కొన్న విధంగా ఉష్ణోగ్రతల్ని కూడా తాజా నివేదిక ప్రస్తావిస్తూ.. ప్రపంచం వ్యాప్తంగా 3 నుంచి 5 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు పెరుగుతాయని.. వాటి కారణంగా కోట్లాది మంది మీద ప్రభావం పడనున్నట్లు పేర్కొన్నారు. సగటున ఉష్ణోగ్రతలు మూడు డిగ్రీల సెల్సియస్ మేర పెరిగినా.. సముద్ర మట్టాలు 0.5 మిల్లీ మీటర్ల మేర పెరుగుతాయని.. తద్వారా బంగ్లాదేశ్.. అమెరికాలోని ఫ్లోరిడా మునిగిపోవటం ఖాయమన్న అంచనాలు వేస్తున్నారు. ఇక.. సముద్ర తీర నగరాలైన షాంఘై.. లాగోస్.. ముంబయి లాంటి ప్రాంతాలు చిత్తడిగా మారుతాయని వివరించారు. దీంతో.. కాందిశీకుల సమస్య భారీగా పెరిగే ప్రమాదం ఉందంటున్నారు.
ఇదంతా మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగితే చోటు చేసుకునే ఉత్పాతం కాగా.. నాలుగు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగిన పక్షంలో.. ముప్పు మరింత ఎక్కువ అవుతుందని హెచ్చరించింది. అదే జరిగితే మనుష్య జనాభాలో 90 శాతం మేర తుడిచిపెట్టుకునే ప్రమాదం ఉందన్నారు. ఈ ముప్పు 30 ఏళ్లలో పొంచి ఉందన్న నివేదిక.. ఈ ముప్పునకు విరుగుడుగా నివారణ చర్యలు చేపట్టని పక్షంలో 100 కోట్ల మంది తమ నివాసాల్ని మార్చుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. మనిషి చేసిన తప్పులకు.. భారీగా మూల్యం చెల్లించే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. మరి.. ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు చేపడతాయో చూడాలి.