ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ పునరుద్ధరణ

Update: 2020-09-13 09:10 GMT
ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ-ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ ను తిరిగి పునరుద్ధరించారు. ఇటీవల ట్రయల్స్ లో బ్రిటన్ కు చెందిన ఓ వలంటీర్ అనారోగ్యం బారినపడ్డారు. దీంతో ట్రయల్స్ ను తాత్కాలికంగా నిలిపివేసిన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రయోగాలను మళ్లీ పునరుద్ధరించినట్లుగా ఆస్ట్రాజెనెకా ఒక ప్రకటనలో వెల్లడించింది. బ్రిటన్ లోని మెడిసన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీ (ఎంహెచ్.ఆర్.ఏ) వ్యాక్సిన్ కు క్లియరెన్స్ ఇచ్చినట్టు తెలిసింది. దీంతో ఎట్టకేలకు మళ్లీ క్లినియల్ ట్రయల్స్ మొదలయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా చివరి దశ ప్రయోగాల్లో ఉన్న 9 వ్యాక్సిన్లలో ఆక్స్ ఫర్డ్ టీకా కూడా ఒకటి. బ్రిటన్ తోపాటు అమెరికా, భారత్, బ్రెజిల్, సౌత్ ఆఫ్రికాల్లో ఈ ఆస్ట్రాజెనెకా ట్రయల్స్ కొనసాగుతున్నాయి.

వ్యాక్సిన్ సేఫ్టీపై ఓ స్వతంత్ర్య కమిటీని నియమించారు. బ్రిటన్ లో వ్యాక్సిన్ ట్రయల్స్ సేఫ్టీని ధ్రువీకరిస్తూ ఆ కమిటీ మెడిసిన్స్ హెల్త్ రెగ్యులేటరీ అథారిటీకి సిఫారసు చేసింది. దీంతో మళ్లీ ప్రయోగాలకు ఆక్స్ ఫర్డ్ సిద్ధమైంది.

కాగా టీకాతో ఆరోగ్యం విషమించిన వ్యక్తికి ఇతర అనారోగ్య సమస్యల వల్లే ఇలా జరిగిందని గుర్తించినట్టు సమాచారం. అందుకే టీకా ప్రయోగాలు మళ్లీ మొదలైనట్టు తెలుస్తోంది.
Tags:    

Similar News