కరోనా: కృనాల్ పాండ్యాను కలిసిన 8మంది భారత క్రికెటర్లు

Update: 2021-07-28 14:30 GMT
శ్రీలంకలో పర్యటిస్తున్న యువ భారత జట్టును కరోనా కాటేసింది. భారత ఆల్ రౌండర్ కృనాల్ పాండ్యా కరోనా పాజిటివ్ బారిన పడడంతో శ్రీలంక-భారత్ మధ్య జరగాల్సిన రెండో టీ20 మ్యాచ్ ను అర్థాంతరంగా వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

కరోనా సోకడంతో కృనాల్ పాండ్యాను క్వారంటైన్ కు పంపిన అధికారులు.. అతడితో సంబంధం ఉన్న 8 మంది భారత క్రికెటర్లను గుర్తించారు. వీరిలో ఇంగ్లండ్ టూర్ కు ఎంపికైన ఫృథ్వీ షా, సూర్యకుమార్ యాదవ్ లు కూడా ఉండడం విశేషం.

ఇంగ్లండ్ లో పర్యటిస్తున్న భారత సీనియర్ల జట్టులో ఆవేశ్ ఖాన్, శుభ్ మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ లు గాయాల బారిన పడడంతో ఫృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ లను రిప్లేస్ మెంట్ గా బీసీసీఐ ఎంపిక చేసింది. లంక టూర్ ముగియగానే వారు ఇంగ్లండ్ వెళతారు..

అయితే కృనాల్ పాండ్యా కరోనా బారినపడడంతో ఇతడితో సన్నిహితంగా ఉన్న 8మందిని కూడా క్వారంటైన్ చేశారు. దీంతో వారి ఇంగ్లండ్ ప్రయాణం మరింత ఆలస్యం కానుంది.

మొదటి టీ20 విజయం అనంతరం ఇంగ్లండ్ వెళ్లాల్సిన వారిలో ఉన్న ఫృథ్వీషా, సూర్యకుమార్ యాదవ్ తోపాటు మరో 8మందితో కృనాల్ పాండ్యా కలిసినట్టుగా తేలింది. ఈ ఆటగాళ్లు లేకుండా రెండో టీ20 మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది. ప్రస్తుతం భారత జట్టులో 24మంది ప్లేయర్లు ఉన్నారు. దీంతో కృనాల్ తోపాటు 8మంది ప్లేయర్లు లేకుండా రెండో టీ20 మ్యాచ్ నిర్వహించాల్సి ఉంటుంది.

కృనాల్ పాండ్యాను క్వారంటైన్ కు తరలించిన అధికారులు మిగిలిన ఆటగాళ్లకు కరోనా టెస్టులు నిర్వహించి నెగిటివ్ వస్తే ఈరోజు రెండో టీ20ని,జూలై 29న మూడో టీ20 మ్యాచ్ ను నిర్వహిస్తారు.
Tags:    

Similar News