సీఎంగా బాబు చివ‌రి ట్రిప్ ఇదేనా?

Update: 2019-05-22 05:21 GMT
రోజుల త‌ర‌బ‌డి ఎదురుచూస్తున్న రోజు ద‌గ్గ‌ర‌కు వ‌చ్చేసింది. దాదాపు ఆరు వారాల‌కు పైనే నిరీక్ష‌ణ నేటితో ముగియ‌నుంది. రేపు ఇదే స‌మ‌యానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు ఎవ‌రికి అనుకూలంగా రానున్న విష‌యంపై స్ప‌ష్ట‌త రావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రో రోజులో రిజ‌ల్ట్ వ‌స్తున్న వేళ‌.. ఏపీ ముఖ్య‌మంత్రి హోదాలో చంద్ర‌బాబు వెళ్లిన ట్రిప్ ఒక‌టి ఆస‌క్తిక‌రంగా మారింది.

దేశానికి రాజైనా.. సొంతూరుకు మాత్రం సామాన్యుడే. కానీ.. రాజు హోదాలో సొంతూరుకు వెళితే ఆ కిక్కే వేరు. నూటికి వెయ్యి శాతం గెలుస్తాన‌ని.. త‌న గెలుపు కావాలంటే రాసి పెట్టుకోవాల‌ని చెబుతున్న‌ప్ప‌టికీ.. బాబు మాత్రం సీఎం హోదాలో త‌న చివ‌రి ట్రిప్ తాను ప్రాతినిధ్యం వ‌హించే కుప్పానికి వెళ్ల‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది.

రేప‌టి ఫ‌లితాలు జ‌గ‌న్ కు అనుకూలంగా ఉంటాయ‌న్న ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాలు నిజ‌మైన ప‌క్షంలో సీఎంగా ఆయ‌న ఆఖ‌రి ట్రిప్ కుప్పం అవుతుంద‌ని చెప్పాలి. ఢిల్లీ నుంచి బెంగ‌ళూరు వ‌ర‌కూ ఫ్లైట్ లో వ‌చ్చిన ఆయ‌న‌.. అక్క‌డి నుంచి హెలికాఫ్ట‌ర్ లో శాంతిపురం మండ‌ల ప‌రిధిలోని గ‌ణేష‌పురం వ‌ద్ద‌నున్న హెలిప్యాడ్ కు చేరుకున్నారు. అక్క‌డ నుంచి త‌న సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన కుప్పంకు వెళ్ల‌నున్నారు.

అక్క‌డ ఈ రోజు జ‌ర‌గనున్న ప్ర‌స‌న్న తిరుప‌తి గంగ‌మాంబ జాత‌ర‌లో ఆయ‌న పాల్గొన‌నున్నారు. జాత‌ర‌లో పాల్గొన‌టంతో పాటు.. ప‌లు కార్య‌క్ర‌మాల్లో ఆయ‌న హాజ‌రు కానున్నారు. భార్య భువ‌నేశ్వ‌రితో పాటు జాత‌ర‌లో బాబు పాల్గొన‌నున్నారు. అనంత‌రం బెంగ‌ళూరు మీదుగా విజ‌య‌వాడ‌కు వెళ్ల‌నున్నారు. రేప‌టి ఎన్నిక‌ల్లో ఓట‌మి పాలైతే.. బాబుకు కుప్ప‌మే ఆఖ‌రి అధికారిక పర్య‌ట‌న అవుతుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News