ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రం మోసం చేసిందని ఏడాది క్రితం బీజేపీ నుంచి బయటకు వచ్చేశారు చంద్రబాబు. మోదీ తెలుగు ప్రజల్ని నమ్మించి గొంతు కోశారని అప్పటినుంచి చంద్రబాబు ఆరోపిస్తూనే ఉన్నారు. కేవలం ఆరోపణలేనా.. ధర్మపోరాట దీక్షలంటా ఊరూ వాడా చేశారు. ఏపీలోని కొన్ని ముఖ్య పట్టణాలతో పాటు ఢిల్లీలో కూడా ధర్మ పోరాట దీక్షలు చేశారు. విశాఖ రైల్వే జోన్ అంశంతో ప్రత్యేక హోదా కాస్త మరుగున పడిపోయింది. ఇప్పుడు జోన్ విషయంలో కూడా మోదీ సర్కార్ తెలుగు ప్రజల్ని మోసం చేసిందని విమర్శలకు దిగారు చంద్రబాబు. ఈ సందర్భంగా ముఖ్య పట్టణాల్లో నిరసనలు చేశారు. నల్ల చొక్కాలతో ప్రదర్శనలు ఇచ్చారు. చంద్రబాబు కూడా నల్ల చొక్కాల తోనే తన కార్యక్రమాలకు హాజరయ్యారు. మంత్రులు - టీడీపీ శ్రేణులు కూడా చంద్రబాబుని ఫాలో అయిపోయాయి.
రైల్వే జోన్ విషయంలో చంద్రబాబు తన నిరసనల డోస్ ని పెంచాడు. నల్లచొక్కాలంతో హాజరు అవడంతో పాటు.. బెలూన్లు ఎగరేయడం - ర్యాలీలు నిర్వహించడం లాంటివి చేశారు. వీటితో పాటు.. రెండు రోజుల క్రితం.. మోదీకి బహిరంగ లేఖ రాశారు. ఇక్కడే చంద్రబాబు తన తెలివిని ప్రదర్శించారు. రాసిన లేఖని.. మెయిల్ లోనే పంపించినా.. తానేం రాశానో ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో.. అన్ని పేపర్లకు యాడ్స్ ఇచ్చారు. ప్రభుత్వం నుంచి యాడ్స్ అంటే తెలిసిందే కాదు.. మొత్తం ప్రభుత్వం సొమ్మే. ఇక నిన్న - ఇవాళ జరిగిన నిరసనలకు - ఊరూ వాడా పెట్టిన హోర్డింగులకు కూడా ప్రభుత్వ సొమ్మునే ఉపయోగిస్తున్నారు. ఎందుకంటే ఇది ప్రజల సమస్య కాబట్టి.. ప్రజలకు బాధ్యత ఉండాలని బాబుగారు సెలవిచ్చారు. సో.. రాజకీయమైన, నిరసనలైనా చంద్రబాబు స్టైలే వేరు.