మాటలు తర్వాత చేష్టలతో తరచూ వివాదాల్లో చిక్కుకునే కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు తాజాగా కొత్త తలపోటు మొదలైంది. ఆయన తాజాగా వ్యవహరించిన తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరి మనోభావాల్ని దెబ్బ తీసిన ముఖ్యమంత్రికి కొత్త తరహా సవాళ్లు ఎదురవుతున్నాయి. తాజాగా ఆ రాష్ట్ర మాజీ మంత్రి సోగడు శివణ్ణ భారీ సవాలును విసిరారు.
హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసిన ముఖ్యమంత్రి.. పంది మాంసం తిని మసీదుకు వెళ్లగలరా? అంటూ వ్యాఖ్యానించారు. హిందువుల మనోభావాల్ని దెబ్బ తీసి తనను తాను సమర్థించుకుంటున్న సీఎం.. తాను విసిరిన సవాల్ ను స్వీకరించగలరా? అంటూ మండిపడుతున్నారు. ఇంతకీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అంతలా మండిపడటానికి కారణం ఏమిటి? ఆయనేం చేశారు? మధ్యలో ముస్లింలు సీన్లోకి ఎందుకు వచ్చారు? అన్నది చూస్తే..
మూడు రోజుల క్రితం అంటే.. ఆదివారం దక్షిణ కర్ణాటక జిల్లా అయిన బంట్వాళలో మాంసం.. చేపల కూర తిన్న సిద్ధరామయ్య.. కొందరు మంత్రులతో కలిసి పవిత్ర పుణ్యక్షేత్రమైన ధర్మస్థలం వెల్లారు. అక్కడ ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తర్వాత ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలం వెళ్లారు. అక్కడ మంజునాథ స్వామిని దర్శించుకొని పూజలు చేశారు. మాంసం తిని పుణ్యక్షేత్రం వెళ్లి.. స్వామివారిని దర్శించుకోవటంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి.
ఇదిలా ఉంటే.. తాను చేసిన పనిని సిద్దరామయ్య సమర్థించుకున్నారు. తన ఆహార అలవాట్లు అలానే ఉంటాయని.. అయినా మాంసం తిని దేవాలయాన్ని దర్శించుకుంటే తప్పేంటి? అంటూ ప్రశ్నించారు. ఈ సందర్భంగా భక్త కన్నప్ప ను గుర్తు చేస్తూ.. తాను ఆయన్ను ఆదర్శంగా తీసుకుంటానన్నారు. దీనిపై పలువురు మండిపడుతున్నారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి శివణ్ణ రియాక్ట్ అవుతూ.. సిద్ధరామయ్యకు దమ్ముంటే పందిమాంసంతో భోజనం చేసి మసీదుకు వెళ్లి రావాలంటూ సవాలు విసిరారు. హిందువుల మనోభావాలు దెబ్బ తీసి తనను తాను సమర్థించుకుంటున్న సిద్ధరామయ్య పంది మాంసం తిని తాను చెప్పినట్లుగా చేస్తే.. ప్రజలు ఆయన మాటల్ని నమ్ముతారంటున్నారు. స్వార్థం కోసం సిద్ధరామయ్య కులాలు.. మతాల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ మండిపడ్డ మాజీ మంత్రి మాటలకు ముఖ్యమంత్రి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.