ఏపీలో కరోనా మహమ్మారి వ్యాప్తి రోజురోజుకి పెరుగుతూనే ఉంది. ప్రతి రోజు కూడా దాదాపుగా 10 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఏపీలో ఇప్పటివరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 4,98,125కి చేరింది. కరోనాను జయించి వీరిలో 3,94,019 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి అయ్యారు. ప్రస్తుతం ఏపీలో మొత్తం99,689యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటి వరకు 4,417 మంది మరణించారు. అలాగే , ఇప్పటి వరకు 41,07,890మందికి కరోనా పరీక్షలు చేసినట్లు ఏపీ వైద్యఆరోగ్యశాఖ తెలిపింది. రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయాలనీ ప్రభుత్వం ఎంతగా ప్రయత్నం చేస్తున్నప్పటికీ , కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
ఇకపోతే, తాజాగా రాష్ట్రంలో కరోనా వ్యాప్తి పై సీఎం జగన్ స్పందన కార్యక్రమంలో సమీక్ష నిర్వహించారు. కరోనా మహమ్మారి పై నిర్లక్ష్యం వద్దు, నిరంతరం అప్రమత్తంగానే ఉండాలని అధికారులతో చెప్పారు. కరోనా తో కలిసి జీవించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్న సీఎం జగన్ అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు జరగాలన్నారు. ఉదాసీనత లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. పిహెచ్‌సిలు, యుహెచ్‌పిలు, ఏరియాఆసుపత్రులు, టీచింగ్ ఆసుపత్రలు, జిజిహెచ్ లలో పరీక్షల నిర్వహణ తప్పనిసరి అని సీఎం జగన్ స్పష్టం చేశారు.
రాష్ట్రప్రజలకు కరోనా వైరస్ పరీక్షల కోసం ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాని పరిస్థితి తలెత్తకూడదన్నారు. వీటికి సంబంధించి అన్ని అవసరాలకు 104 కాల్ సెంటర్‌ను ఉపయోగించుకోవాలి. ఈ నంబర్‌ను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని చెప్పారు. 104 కాల్ సెంటర్ నుంచి జిల్లా కలెక్టర్లకు రిక్వెస్ట్‌లు వస్తే వెంటనే దానిపై స్పందించాలన్నారు. ఆ ఫోన్ కాల్స్‌పై ఎలా రెస్పాండ్ అవుతున్నామనేదే పని తీరుకు అద్దం పడుతుందని జగన్ కలెక్టర్లకు దిశానిర్ధేశం చేశారు. ఆర్‌టీపీసీఆర్, ట్రూనాట్ పరీక్షల్లో నమూనాలు తీసుకున్న 24 గంటలు, రాపిడ్ పరీక్షలో 30 నిమిషాల్లో ఫలితం అందించే విధంగా జిల్లా కలెక్టర్లు దృష్టిపెట్టాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు.