మీడియాపై సీఎం జ‌గ‌న్ ఫైర్‌.. ఏమ‌న్నారంటే!

Update: 2022-02-08 08:45 GMT
ఏపీ సీఎం జ‌గ‌న్‌.. ఓ వ‌ర్గం మీడియాపై తీవ్ర‌స్థాయిలో ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఉద్యోగులు త‌ల‌పెట్టిన స‌మ్మెను నివారించేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంద‌ని.. వారితో ద‌ఫ‌ద‌ఫాలుగా చ‌ర్చించి.. వారి స‌మ‌స్య‌ల‌ను ప‌ర‌ష్క‌రించే ప్ర‌య‌త్నం చేసింద‌ని.. దీంతో ఉద్యోగుల‌కు.. ప్ర‌భుత్వానికి మ‌ధ్య సంధి ఏర్ప‌డి.. వారు నిర‌స‌న విర‌మించుకున్నార‌ని.. సీఎం తెలిపారు.

అయితే.. దీనిని జీర్నించుకోలేని.. టీడీపీ.. నేత‌లు.. ప‌చ్చ అజెండాను అమ‌లు చేశార‌ని.. విమ‌ర్శించారు. ఈ క్ర‌మంలో క‌మ్యూనిస్టులు.. ప‌చ్చ అజెండాను అమ‌లు చేసేందుకు ముందుకు వ‌చ్చార‌ని అన్నారు.

అదేస‌మ‌యంలో వీరికి అండ‌గా.. ఎల్లో మీడియా క‌న్నీరు పెట్టుకుంద‌ని.. ఉద్యోగులు స‌మ్మె చేయ‌కూడ‌ద ని.. ప్ర‌భుత్వం, ప్ర‌జ‌లు భావించార‌ని.. అయితే.. ఎల్లో మీడియా మాత్రం స‌మ్మె కోరుకుంద‌ని.. అందుకే.. స‌మ్మె విర‌మిస్తున్న‌ట్టు ఉద్యోగులు ప్ర‌క‌టిస్తే.. ఎల్లో మీడియా ఏఏడుపు మొహం పెట్టుకుంద‌ని.. సీఎం అ న్నారు.

ఎవ‌రో ఎక్క‌డో సోష‌ల్ మీడియాలో విమ‌ర్శ‌లు చేస్తే కూడా.. దానిని కూడా ఫ్రంట్ పేజీలో ప్ర‌చురిం చే స్థాయికి ఎల్లో మీడియా దిగ‌జారి పోయింద‌ని అన్నారు. అదేస‌మ‌యంలో ఆశా కార్య‌క‌ర్త‌లు.. ఎక్క‌డో స‌మ్మె చేస్తే.. దానికి సంబంధించి కూడా భారీ ఎత్తున ప్రంట్ పేజీలో ఫొటోలువేసి.. ఈనాడు గుండెలు బాదుకుంద‌ని విమ‌ర్శించారు.

ఉద్యోగులు ఉద్య‌మం వ‌ద్ద‌ని ప్ర‌జ‌లు, ప్ర‌భుత్వం కోరుకుంటే.. ఎల్లో మీడియా మాత్రం అవే కావాల‌ని.. కోరు కుని.. ఎక్క‌డో ఒక చోట ఎవ‌రినో ఒక‌రిని గిల్లి వాటినే రాజ‌కీయాలు చేసి.. ఆనందిస్తోంద‌ని సీఎం అన్నారు. ఇంత దిగ‌జారిపోయిన మీడియా కూడా ఉంటుందా? అనిత‌మ‌కు ఆశ్చ‌ర్యం వేసింద‌ని.. అదేస‌మ‌యంలో ఒకింత బాధ క‌లిగినా.. మ‌రోవైపు న‌వ్వు కూడా వ‌స్తోంద‌న్నారు. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ఉద్యోగుల‌కు మంచి చేస్తున్న ప్ర‌బుత్వంగా, అక్క‌చెల్లెమ్మ‌ల‌కు మంచిచేస్తున్న ప్ర‌భుత్వంగా ఉంటేచూసి జీర్నంచుకోలేక పోతున్నార‌ని.. దుయ్య‌బ‌ట్టారు.

చంద్ర‌బాబు అధికారంలో లేడ‌నే అక్క‌సుతో త‌మ‌పై బుర‌ద జ‌ల్లుతున్నార‌ని సీఎం జ‌గ‌న్ విమ‌ర్శ‌లు గుప్పించారు. గ‌తంల ఎస్సీల‌ను కించ‌ప‌రిచిన చంద్ర‌బాబు అంటే.. రామోజీరావు ప్రేమ కారిపోతోంద‌ని దుయ్య‌బ‌ట్టారు. పాపం నాయీ బ్రాహ్మ‌ణులు త‌మ‌కు క‌నీస వేత‌నం అమ‌లు చేయాల‌ని కోరితే.. మీ అంతు చూస్తా.. అంటూ బెదిరించిన‌.. చంద్ర‌బాబు అంటే.. ఎల్లో మీడియాకు ప్రేమ అని అన్నారు.
Tags:    

Similar News