సీఎం జగన్ మరోసారి విరుచుకుపడ్డారు. విజయడవాడలో పోలీసుల అమరవీరుల సంస్మరణ దినంలో కీలక వ్యాఖ్యలు చేశారు. టీడీపీ దీక్షలపై కామెంట్స్ చేశారు. సీఎంను తిట్టడం కరెక్టేనా? అని ప్రశ్నించారు. గంజాయి పేరుతో రాష్ట్ర పరువును బజారున పడేస్తున్నారని ప్రతిపక్షాలపై జగన్ మండిపడ్డారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఇక అధికారంలోకి రాలేమని తేలిందని.. అందుకే రాష్ట్రంలో గొడవలు చేసేందుకు కుట్ర చేస్తున్నారని జగన్ ఆరోపించారు. వీళ్లు దాడి చేస్తోంది.. ముఖ్యమంత్రి, ప్రభుత్వం మీద మాత్రమే కాదని.. రాష్ట్రంలోని ప్రతి కుటుంబం మీద దాడి చేస్తున్నారని సీఎం జగన్ ఆరోపించారు.
రాష్ట్రంలో భావోద్వేగాలు రెచ్చగొట్టి గొడవలు పెట్టాలని చూస్తున్నారని జగన్ చెప్పుకొచ్చారు. చివరికి ముఖ్యమంత్రి తల్లిని ఉద్దేశించి టీడీపీ నేతలు బూతులు తిడుతున్నారని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అనైతిక, అధర్మం అన్నారు.సంఘ విద్రోహ శక్తుల విషయంలో పోలీసులు కఠినంగా వ్యవహరించాలని సీఎం సూచించారు.
సంఘ విద్రోహ శక్తులు రూపు మార్చుకున్నాయని.. రాష్ట్రం పరువు, ప్రతిష్టను కొందరు దిగజార్చుతున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డ్రగ్స్ ఆంధ్రప్రదేశ్’ అంటూ ఇమేజ్ ను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అసత్యాలు వద్దని డీజీపీ చెప్పినా లెక్కలేనితనంగా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. లా అండ్ ఆర్డర్ విషయంలో రాజీపడే ప్రసక్తే లేదన్నారు.
సంక్షేమ పథకాలు అడ్డుకునేందుకు కోర్టుల్లో కేసులు వేస్తున్నారని.. చీకట్లో ఆలయాల రథాలను తగులబెడుతున్నారని జగన్ ఆరోపించారు.
రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థలో ఎన్నో మార్పులు తెచ్చామని సీఎం వైఎస్ జగన్ అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా పోలీసులకు వీక్లీ ఆఫ్ లు ప్రకటించామని గుర్తు చేశారు. 2017 నుంచి బకాయిలు ఉన్న 15 కోట్లు విడుదల చేశామని భారీగా ఉద్యోగ నియామకాలు చేపట్టనున్నామని వెల్లడించారు. హోంగార్డుల గౌరవ వేతనం పెంచామన్నారు. కోవిడ్ తో మృతి చెందిన పోలీస్ కుటుంబాలకు ఎక్స్ గ్రేషియా ఇచ్చామన్న సీఎం జగన్.. పోలీసులే కాకుండా ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబాల్లోనూ కారుణ్య నియామకాలకు ఆదేశించామని ఇది కూడా నవంబర్ 30లోపు చేపట్టాలని గడువు కూడా విధించామని సీఎం జగన్ తెలిపారు.