ఏపీలో టెలీ మెడిసిన్ సేవలు .. ఎలా పనిచేస్తుందంటే ?

Update: 2020-04-14 15:30 GMT
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కరోనాను రాష్ట్రంలో అరికట్టడంలో భాగంగా రాష్ట్రంలో టెలీ మెడిసిన్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. కరోనా వ్యాధి ఉన్నట్టు అనుమానం ఉన్న ఎవరైనా కూడా టోల్‌ ఫ్రీ నెంబరు 14410  కి కాల్ చేయాలని ప్రభుత్వం తెలిపింది. ఈ నంబరుకు కరోనా లక్షణాలు ఉన్న వారు తమ సెల్ ఫోన్లో మిస్ కాల్ ఇస్తే చాలు అక్కడి సిస్టమ్‌ ఆ మొబైల్‌ నెంబరును, మొత్తం వివరాలను నమోదు చేసుకుంటుంది.

ఆ తర్వాత ఎగ్జిక్యూటివ్ రోగికి కాల్‌ చేసి, వారు ఉంటున్న ప్రదేశం, వయసు, రోగ లక్షణాల వంటి పూర్తి వివరాలు తెలుసుకుంటారు. రోగికి ఒక గుర్తింపు సంఖ్య (ఐడీ) ఇస్తారు. రోగి వివరాలన్నీ టెలి మెడిసిన్‌ వ్యవస్థకు కనెక్ట్‌ అయిన వైద్యులందరికీ కనిపిస్తాయి. ఆ సమయంలో డాక్టర్ల బృందంలో ఎవరో ఒకరు ఆ కాల్‌ ను స్వీకరించి, కాల్‌ చేసి ఓపీ సేవలు అందిస్తారు. ఆ రోగికి నిర్వహించవలసిన పరీక్షలు, అందించాల్సిన మందులను వైద్యులు తెలియజేస్తారు. వ్యాధి లక్షణాలను బట్టి కరోనా అనుమానిత రోగులను గుర్తిస్తారు. 

అవసరమైతే వీరిని ఏ ఆస్పత్రికి పంపించాలి, ఎక్కడకు తరలించాలన్నదానిపై కూడా వైద్యులు నిర్ణయం తీసుకుని ఆ మేరకు వారిని తరలిస్తారు.కరోనా అనుమానిత కేసుల జాబితాల రూపకల్పనతో పాటు ఆ రోగులకు అవసరమైన పరీక్షలు - క్వారంటైన్ - ఐసొలేషన్‌ తో పాటు చికిత్స కోసం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు - జిల్లా - రాష్ట్ర స్థాయిలో ఆ జాబితాలు సిద్ధం చేస్తారు. టెలి మెడిసిన్‌ ఉద్దేశం కరోనా కేసులను గుర్తించడం - ఐసొలేట్‌ చేయడం - పరీక్షించడం - క్వారంటైన్‌ కు పంపించడం. ఈ విధంగా మూడంచెలుగా డాక్టర్‌ వైయస్సార్‌ టెలీ మెడిసిన్‌ ఏపీలో  అమలవుతుంది.
Tags:    

Similar News