కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సీఎం జగన్ భేటి ముగిసింది. హడావుడిగా ఖరారైన ఈ మీటింగ్ కోసం సీఎం జగన్ ఉన్నఫళంగా అన్ని కార్యక్రమాలు రద్దు చేసుకొని విమానం ఎక్కారు. సాయంత్రం 6 గంటలకు అమిత్ షాతో భేటి కోసం సాయంత్రం 4 గంటలకు బయలుదేరారు.
సీఎం జగన్ ఈ ఢిల్లీ పర్యటనలో కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షాతో భేటి అయ్యారు. అమిత్ షా నివాసంలో ఈ భేటి జరిగింది.
అమిత్ షా ఇటీవలే కరోనా సోకి ఆస్పత్రుల్లో చికిత్స పొంది ఇంట్లోనే రిలాక్స్ అవుతున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ తో భేటి ఆయన ఇంట్లోనే సాగింది. దాదాపు 50 నిమిషాల పాటు వీరి భేటి జరిగినట్టు తెలిసింది.
విభజన చట్టంలోని హామీల అమలు, పోలవరం, కోవిడ్ సహా రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధుల అంశాలను అమిత్ షాకు సీఎం వివరిస్తున్నట్లు సమాచారం . సీఎం జగన్ వెంట వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
ఈ భేటి అనంతరం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ , కేంద్ర జలశక్తి శాఖ గజేంద్ర సింగ్ షెకావత్ తో సీఎం జగన్ సమావేశం కానున్నారు.
కాగా ఇటీవల ఏపీ హైకోర్టు తీర్పులు, అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు.. ఈ కుంభకోణంపై సీబీఐ విచారణకు కేబినెట్ తీర్మానించినట్టు వార్తలు రావడంతో జగన్ తో అమిత్ షా భేటి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.