మంత్రిని చేస్తాన‌న్నాడు జ‌గన్‌.. ఈ చిన్న ప‌ద‌వితో స‌రిపెట్టేశారా ?

Update: 2022-04-20 09:31 GMT
తాజాగా వైసీపీలో అసంతృప్తుల‌ను బుజ్జ‌గించే కార్య‌క్ర‌మానికి తెర‌దీశారు. మంత్రి ప‌ద‌వులు వ‌స్తాయ‌ని భావించిన వారికి ద‌క్క‌లేదు. దీంతో వారంతా కూడా పార్టీపై తిరుగుబాటు చేసినంత ప‌నిచేశారు. అదేస‌మ‌యంలో ఇప్ప‌టి వ‌ర‌కు మంత్రులుగా ఉన్న‌వార‌ని కూ డా 14 మందిని ప‌క్క‌న పెట్టారు.

వాస్త‌వానికి ఒక‌టి లేదా ఇద్ద‌రు మంత్రుల‌ను కొన‌సాగిస్తార‌ని.. అనుకున్నా.. ఏకంగా ప‌లు ఈక్వేష‌న్ల పేరు చెప్పి.. 11 మందిని పాత మంత్రుల‌ను కొత్త కేబినెట్ 2.0లో జ‌గ‌న్ తీసుకున్నారు. దీంతో మిగిలిన మంత్రులు ఆవేద‌న‌కు గుర‌య్యారు. ఈ క్ర‌మంలోనే రాజీనామాల ప‌ర్వం కూడా తెర‌మీదికి వ‌చ్చింది.

ఇక‌, ఇప్పుడు జిల్లాల ఇంచార్జ్ బాధ్య‌తల‌ను మంత్రుల‌కు అప్ప‌గిస్తూనే.. జిల్లా అధ్య‌క్ష‌, కో ఆర్డినేష‌న్ బాధ్య‌త‌ల‌ను అసంతృప్తు ల‌కు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో కీల‌క‌మైన నాయ‌కుడిగా ఉన్న క‌మ్మ సామాజిక వ‌ర్గానికి చెందిన మ‌ర్రి రాజ‌శేఖ‌ర్‌కు.. కూడా జిల్లాల కోఆర్డినేట‌ర్‌గా నియ‌మించారు.

గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో చిల‌క‌లూరి పేట నుంచి పోటీ చేయాల్సిన ఆయ‌న‌ను చివ‌రి నిముషంలో త‌ప్పించారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న‌కు ఏకంగా ఎమ్మెల్సీ ఇచ్చి.. మంత్రి ప‌ద‌విని కూడా ఇస్తామ‌ని.. జ‌గ‌న్ స్వ‌యం గా హామీ ఇచ్చారు. అయితే.. మూడేళ్లు గ‌డిచిపోయినా.. ఈ రెండింటిలో ఒక్క‌టి కూడా చేయ‌లేక‌పోయారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న సోద‌రుడు ఇటీవ‌ల జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. న‌మ్మినందుకు బాగానే చేశారంటూ.. విరుచుకుప‌డ్డారు. ఇక‌, తాజాగా జ‌రిగిన మంత్రి వ‌ర్గం కూర్పులోనూ.. ఆయ‌న‌కు ప్రాధాన్యం ఇవ్వ‌కుండా.. ఇదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం ద‌క్కించుకున్న విడ‌ద‌ల ర‌జ‌నీకి అవ‌కాశం ద‌క్కించారు. దీంతో మ‌ర్రి పూర్తిగా డైలామాలో ప‌డిపోయారు. ఇక‌, త‌న రాజకీయాలు అయిపోయాయ‌ని అనుకున్నారు. త‌న దారితాను చూసుకునేందుకు రెడీ అయ్యారు. ఈ స‌మ‌యంలో హ‌ఠాత్తుగా ఆయ‌న‌కు జిల్లాల కో - ఆర్డినేట‌ర్‌గా నియ‌మిస్తూ.. జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు.

దీనిలో భాగంగా.. ఉమ్మ‌డి కృష్ణా జిల్లాలోని.. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల కోఆర్డినేట‌ర్‌గా మ‌ర్రి  రాజ‌శేఖ‌ర్‌ను నియ‌మించారు. అయితే.. త‌న‌కు ఇస్తాన‌న్న ప‌ద‌వికి ఇది నాలిగింత‌లు త‌క్కువ‌ని.. ఆయ‌న బాహాటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. టికెట్ త్యాగం చేయ‌డంతోపాటు.. పార్టీకి ఎన్నో ఏళ్లుగా ప‌నిచేస్తున్న త‌న‌కు.. ఇప్పుడు ఇదా గుర్తింపు అని ఆయ‌న అనుచ‌రుల వ‌ద్ద వ్యాఖ్యానించారు.

ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఆయ‌న అస‌లు ఈ బాధ్య‌త‌లు తీసుకుంటారా?  లేదా? అనేది సందేహంగా మారింది. ఏదేమైనా.. ఆయ‌న ఇప్ప‌టికి దీంతో నే స‌రిపెట్టుకోవాల‌ని.. అదిష్టానం తేల్చి చెబుతోంది. మ‌రి ఆయ‌న ఏం చేస్తారో చూడాలి.
Tags:    

Similar News