ఆంధ్రప్రదేశ్‌లో సినిమా టిక్కెట్ల రేట్ల తగ్గింపు అంశం ఇప్పుడు టాలీవుడ్‌లో తీవ్ర ప్రకంపనలు రేపుతోంది. అసలు గతేడాది పవన్‌కళ్యాణ్ వకీల్‌సాబ్ సినిమా రిలీజ్ అయినప్పడే ప్రభుత్వం సడెన్‌గా టిక్కెట్ రేట్లు తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇక కరోనా రెండో దశ తర్వాత వరుస పెట్టి పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. బాలయ్య నటించిన అఖండ సినిమా విషయంలో చూసీ చూడనట్టుగా వ్యవహరించిన ప్రభుత్వం ఆ తర్వాత పుష్ప.. నాని నటించిన శ్యామ్‌సింగరాయ్ సినిమాలకు వచ్చేసరికి కఠినమైన ఆంక్షలు పెట్టేసింది.
టిక్కెట్ రేట్లు తగ్గిచేయడంతో పాటు ఇటు థియేటర్లపై వరుస పెట్టి దాడులు చేస్తూ ఉండడంతో ఇండస్ట్రీలో ప్రకంపనలు రేగుతున్నాయి. అసలు ఏపీలో పరిస్థితి చూసి.. తెలుగు సినిమాలు రిలీజ్ చేసేందుకే ప్రతి ఒక్కరు భయపడుతున్నారు. సురేష్‌బాబు లాంటి ఒకరిద్దరు మాత్రమే ఓటీటీలకు వెళ్లిపోతున్నారు. అసలు త్రిఫుల్ ఆర్, రాధే శ్యామ్ సినిమాలను సైతం రిలీజ్ చేయాలా ? వద్దా ? అన్న డైలమా ఉంది.
తాజాగా ఈ రోజు నూనత సంవత్సరం కానుకగా ఏపీలో టిక్కెట్ రేట్ల అంశంపై సీఎం జగన్మోహన్‌రెడ్డి స్పందించారు. తాను ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నామని.. తాము ముందు చెప్పిన విధంగానే అవ్వా, తాతలకు పించన్ రు. 2500కు పెంచుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. ఈ రోజు గుంటూరు జిల్లా ప్రత్తిపాడులో వైఎస్సార్ పెన్షన్ కానుక పెంపు సందర్భంగా ఆయన పై వ్యాఖ్యలు చేశారు.
తాము కులమతాలకు అతీతంగా పాలన చేస్తూ అర్హులు అందరికి పెన్షన్ ఇస్తన్నామన్నారు. తాను పేదలకు మంచి చేస్తున్నా కొందరు విమర్శలు చేస్తున్నారని.. స్కూళ్లల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినా, ఇప్పుడు సామాన్యులకు వినోదం అందుబాటులో ఉండేందుకు సినిమా రేట్లు తగ్గించినా కూడా దానిపై కొందరు దుష్ప్రచారం చేస్తున్నారంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. చివరకు ఓటీఎస్ విషయంలో కూడా దుష్ప్రచారమా ? అని మండిపడ్డారు. ఏదేమైనా సినిమా టిక్కెట్ రేట్ల తగ్గింపు విషయంలో జగన్ ఇప్పుడున్న పరిస్థితుల్లో పెద్ద మార్పులు లేకుండానే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన వ్యాఖ్యలే చెప్పేశాయి.