టెక్కలి అంటేనే రాజకీయ చైతన్యం కలిగిన ప్రాంతం. ఇప్పటికి పాతికేళ్ల క్రితం అన్న నందమూరి తారక రామారావు టెక్కలి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. అలా టెక్కలి ఏపీ అంతటా మారుమోగింది. ఇక టెక్కలి నుంచి శ్రీకాకుళం దిగ్గజ నేతలు హనుమంతు అప్పయ్య దొర వంటి వారు గెలిచారు, సత్తా చాటారు.
అలాంటి టెక్కలి 2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్ విభజనలో మార్పుచేర్పులు చేసుకుంది. దాంతో కింజరాపు వారి సొంత ఇలాకా నిమ్మాడ ఊరు అక్కడ చేరడంతో టెక్కలి వారి సొంత సీటు అయింది. ఇప్పటికి మూడు సార్లు టెక్కలి నుంచి అచ్చెన్న పోటీ చేస్తే రెండు సార్లు గెలిచారు.
తొలిసారి 2014లో గెలిచాక మంత్రిగా పనిచేశారు. 2019లో శ్రీకాకుళం జిల్లాలో రెండంటే రెండు సీట్లు టీడీపీ గెలిస్తే అందుకో టెక్కలి ఒకటి. ఈసారి అచ్చెన్నాయుడు ఏకంగా ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ అయ్యారు. ఒక విధంగా శ్రీకాకుళం రాజకీయం అంతా టెక్కలి చుట్టూ తిరుగుతుంది. ఆ టెక్కలి కోటను బద్ధలు కొడతామని వైసీపీ ఎంత ప్రయత్నం చేసినా కూడా వీలు కావడంలేదు.
2014లో దువ్వాడ శ్రీనివాస్ పోటీ చేసి అచ్చెన్న మీద ఓడారు. ఇక 2019లో వైసీపీ నేత పేరాడ తిలక్ పోటీ చేసినా అదే సీన్. అలా జగన్ కోరికను నెరవేర్చని హాట్ సీటుగా టెక్కలి ఉంది.
ఈ నేపధ్యంలో టెక్కలి వైపు జగన్ చూపు ఎపుడూ ఉంటుంది. అక్కడ ఉన్నది ఏపీ టీడీపీ ప్రెసిడెంట్ కావడంతో ఇంకా ఎక్కువగా ఫోకస్ పెడుతూ వస్తున్నారు. టెక్కలికి చెందిన వైసీపీ నేత, ఫైర్ బ్రాండ్ దువ్వాడ శ్రీనివాస్ కి ఎమ్మెల్సీ ఇచ్చి మారీ అచ్చెన్న మీదకు రాజకీయ సమరానికి పంపుతున్న వైసీపీ 2024 ఎన్నికల్లో ఆ సీటుని ఎలాగైనా సాధించాలని చూస్తోంది.
ఇక టెక్కలిలో జగన్ మూడేళ్ళ క్రితం పర్యటించారు. నాడు పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంతాలను టచ్ చేస్తూ వెళ్లారు. ఇక ముఖ్యమంత్రి అయ్యాక మాత్రం ఆ వైపు రాలేదు. కానీ ఫస్ట్ టైమ్ టెక్కలిలో జగన్ కాలు మోపబోతున్నారు. సీఎం హోదాలో ఆయన టెక్కలిలో హల్ చల్ చేయబోతున్నారు. అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టబోతున్నారు.
జగన్ టెక్కలి రావడానికి కారణం దువ్వాడ శ్రీనివాస్. ఆయన కుమార్తె వివాహ రిసెప్షన్ వేడుకలకు జగన్ వస్తున్నారు. ఈ నెల 23న జగన్ టెక్కలి టూర్ ఉంది. దాంతో శ్రీకాకుళం జిల్లా రాజకీయాలన్నీ ఆసక్తికరంగా మారాయి. ముఖ్యమంత్రి హోదా జగన్ టెక్కలిలో అది కూడా అచ్చెన్న ఇలాకాలో కాలుమోపడం అంటే ఇంటెరెస్టింగ్ సీన్ గానే చెప్పాలి.
దువ్వాడ శ్రీనివాస్ కి అచ్చెన్నాయుడుకు మధ్య రాజకీయ వైరమే కాదు, వ్యతిగత వైరం కూడా ఉంది. ఇక జగన్ అయితే సీఎం కాగానే అచ్చెన్నాయుడుని ఈ ఎస్ ఐ కేసులో అరెస్ట్ చేయించారు. దాంతో అధినాయకుడికీ, లోకల్ నాయకుడికీ కూడా అచ్చెన్నాయుడు పొలిటికల్ టార్గెట్ అయిన వేళ జగన్ అక్కడకు రావడం అంటే విశేషమే.
జగన్ సీఎం గా టెక్కలికి ఏ వరాలు ప్రకటిస్తారో అన్న ఆసక్తి కూడా అందరిలో ఉంది. అదే విధంగా జగన్ అచ్చెన్న మీద రాజకీయ విమర్శలు చేస్తారా అన్నది కూడా చర్చగా ఉంది. మొత్తానికి జగన్ టెక్కలి టూర్ మాత్రం వైసీపీలో టీడీపీలో కూడా చర్చగానే ఉంది మరి.