త్వరలోనే దావోస్‌లో జరిగే.. ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సుకు సీఎం జగన్ హాజరు కానున్నారు. ఈ నెల 22 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ఈ పెట్టుబడుల సదస్సులో రాష్ట్రానికి సంబంధించిన అంశా లను ప్రస్తావించడంతోపాటు.. పెట్టుబడులను ఆహ్వానించేందుకు ఇది ఒక గొప్ప అవకాశం.
గతంలో చంద్ర బాబు కూడా ఇలానే రెండు నుంచి మూడు సార్లు పెట్టుబడుల సదస్సుకు హాజరయ్యారు. కొన్ని ఒప్పం దాలు చేసుకున్నారు. అయితే.. ఇప్పటి వరకు ఆ ఒప్పందాలు ఏమయ్యాయో.. ఎవరికీ తెలియదు.
ఇక, వైసీపీ అధికారం లోకి వచ్చిన తర్వాత.. ఒక్క పెట్టుబడి కూడా రాలేదు. దీంతో ప్రబుత్వం అసలు అభివృద్ధి దిశగా అడుగులు వేయడం లేదనే విమర్శలు వచ్చాయి. దీని పై ప్రతిపక్షాల నుంచి కూడా విమర్శలు వచ్చాయి.
ఈ నేపథ్యం లో ఇప్పుడు జగన్ కు ఒక చక్కని అవకాశం వచ్చింది. గతంలో పరిశ్రమల మం త్రి దుబాయ్ పర్యటనకు వెళ్లివచ్చారు. అయితే.. అప్పుడు ఏం జరిగిందో ఇప్పటి వరకు తెలియదు. ఆయన హఠాన్మరణంతో అసలు దుబాయ్ పర్యటనకు సంబంధించిన విశేషాలు ఏవీ కూడా బయటకు రాలేదు.
ఇక, ఇప్పుడు.. దావోస్ పర్యటనకు సీఎం బయలు దేరుతుండడంతో రాష్ట్రానికి కొత్త ఆశలు చిగురించాయి. ఒకవైపు... రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన.. వాతావరణం కల్పిస్తున్నామని చెబుతు న్నా.. ఎవరూ ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పైగా.. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ.. ప్రతిప క్షం చేస్తున్న విమర్శులు.. కూడా దీనికి హేతువుగా మారాయి. ఈ నేపథ్యంలోనే జగన్ స్వయంగా దావోస్ పర్యటనకు వెళ్లి పెట్టుబడులు తీసుకువచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఏవిధంగా వ్యవహరిస్తారో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
దావోస్ సమావేశాలకు వివిధ దేశాల నుంచి 2,200 మందికిపైగా ప్రతినిధులు హాజరు కానున్నారు. ప్రధానంగా 18 రంగాలపై చర్చలు జరగనుండగా విద్య, వైద్యం, నైపుణ్యం, తయారీ రంగం, లాజిస్టిక్స్, ఆర్థికసేవలు, పునరుత్పాదక ఇంధనం, టెక్నాలజీ, వినియోగదారుల వస్తువులు, ఎఫ్‌ఎంసీసీ లాంటి పదిరంగాల్లో పెట్టుబడులకు అవకాశాలపై దృష్టి సారించనున్నారు. మరి ఏపీ సర్కారు వీటిలో ఎన్నింటిని అందిపుచ్చుకుంటుందో చూడాలి.