కర్నూలు జిల్లాలోని ఓర్వకల్లులో ఏర్పాటు చేసిన విమానాశ్రయాన్ని ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఈ రోజు ప్రారంభించారు. అంతకు ముందు టెర్మినల్ భవనం వద్ద దివంగత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహావిష్కరణలో ఆయన పలువురు మంత్రులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఈ రోజు చరిత్రలో నిలిచిపోతుంది. గతంలో కర్నూలుకు రోడ్డు, రైలు మార్గంలోనే ప్రయాణం ఉండేది. ఇక నుండి విమాన ప్రయాణం కూడా జరగబోతోంది. రాష్ట్రంలో ఇది 6వ విమానాశ్రయం అని అన్నారు. ఈ నెల 28 నుంచి విమానాశ్రయంలో రాకపోకలు జరుగుతాయన్నారు. కర్నూలు చరిత్రలోనే ఇదో సుదినమని చెప్పారు. సిపాయి తిరుగుబాటు కంటే ముందే రైతుల పక్షాన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి ఉద్యమం చేశారని, ఆయనకు నివాళిగా ఈ విమానాశ్రయానికి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెడుతున్నట్టుగా ఆయన ప్రకటించారు.
ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బాబు గతంలో ఎయిర్ పోర్ట్ డ్రామా ఆడారు. విమానాలు ఎగరని పరిస్థితులు, కనీసం రన్ వే పనులు కూడా పూర్తికాకముందే ఎన్నికల్లో లబ్దిపొందేందుకు రిబ్బన్ కట్ చేశారు అని విమర్శించారు. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోనే ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్, 5 ఫ్లోర్లలో ఎయిర్ ట్రాఫిక్ అడ్మిషన్ బిల్డింగ్, పోలీస్ బ్యారెక్, వీఐపీ లాంజ్, ప్యాసింజర్ లాంజ్, వాటర్ ఓవర్ హెడ్ ట్యాంక్, సబ్ స్టేషన్, రన్ వేలోని బ్యాలెన్స్ పనులను పూర్తి చేశాం అని జగన్ చెప్పారు. ఓర్వకల్లు ఎయిర్‌పోర్టు నుంచి బెంగళూరు, విశాఖపట్నం, చెన్నై నగరాలకు విమానాలను అందుబాటులోకి తీసుకొచ్చామని, క్రమంగా వాటిని మిగిలిన నగరాలకు విస్తరింపజేస్తామని అన్నారు. కర్నూలును న్యాయ రాజధానిగా అభివృద్ధి చేయబోతున్నామని, అలాంటి చోట విమానాశ్రయం అందుబాటులోకి వచ్చిందని చెప్పారు. కర్నూలు శివార్లలోని జగన్నాథ గట్టు వద్ద హైకోర్టు, టౌన్ షిప్‌ను నిర్మించడానికి 250 ఎకరాలను ప్రభుత్వం కేటాయించిన తరువాత.. తొలిసారిగా వైఎస్ జగన్ నోట.. న్యాయ రాజధాని అనే పేరు వెలువడటంతో ఆ మాటలకి ప్రాధాన్యతను సంతరించుకుంది. కర్నూలుకు 18కిలో మీటర్ల దూరంలోని ఓర్వకల్లులో 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం విమానాశ్రయం ఏర్పాటుకు సంకల్పించింది. వెయ్యి ఎకరాల్లో నిర్మించిన ఎయిర్ పోర్టుకు 2016లో కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేసింది. ఆ తర్వాత మూడేళల్లో టెర్మినల్ నిర్మాణం పూర్తైంది. కానీ ఎయిరో డ్రోమ్ అనుమతులు మాత్రం రాలేదు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క 2020లోనే 150 కోట్లు ఖర్చు చేసి రన్ వే, ఇతర అభివృద్ధి పనులను వేగంగా పూర్తి చేసింది.