గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేలు, మంత్రులు, పార్టీ జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్సీపీ ప్రాంతీయ సమన్వయకర్తలతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే.
ఈ సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా నిర్వహించడం లేదని కొంతమంది ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలు నిజం కాదని ప్రభుత్వ సలహాదారు (ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఖండించారు.
ఎంఎల్ఏలు తమ లోపాలను సరిదిద్దుకోవాలని మాత్రమే జగన్ సూచించారని.. ఎలాంటి వార్నింగ్ ఇవ్వలేదని సజ్జల తెలిపారు. వైఎస్సార్సీపీ ఐదేళ్ల పరిపాలన కోసం అధికారంలోకి రాలేదన్నారు.
నిరంతరం ప్రజలకు సేవ చేసేందుకే వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిందని చెప్పారు. ఎంఎల్ఏలు ఎలా పనిచేస్తున్నారని.. ప్రజలే నిర్ణయిస్తారన్నారు. అందుకే నిరంతరం ప్రజల్లో ఉండి వారి సమస్యలు తెలుసుకోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలని మాత్రమే సీఎం జగన్ సూచించారని సజ్జల చెప్పారు.
అయితే ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జుల సమావేశంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం సరిగా నిర్వహించని ఎమ్మెల్యేలపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా ఏలూరు, కోవూరు ఎమ్మెల్యేలు ఆళ్ల నాని, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చాలా తక్కువ రోజులు మాత్రమే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారని వైఎస్ జగన్ మండిపడ్డట్టు వార్తలు వచ్చాయి.
నరసాపురం ఎంఎల్ఏ ముదునూరి ప్రసాదరాజు అందరికంటే ఎక్కువ రోజులు గడప గడపకు మన ప్రభుత్వంలో కార్యక్రమంలో పాల్గొన్నారని జగన్ ప్రశంసించినట్టు సమాచారం!