ప్రకాశం జిల్లా నేతలకు సీఎం జగన్ వార్నింగ్

Update: 2022-04-28 09:30 GMT
మంత్రులు.. ప్రాంతీయ సమన్వయ కర్తలు.. జిల్లా పార్టీ అధ్యక్షులతో కలిసి రివ్యూ సమావేశాన్ని నిర్వహించుకునన వైసీపీ అధినేత కమ్ సీఎంజగన్మోహన్ రెడ్డి అనుకోని రీతిలో రియాక్టు అయి.. ఒక్కొక్కరికి ఒక్కోలాంటి అనుభవాన్ని ఇచ్చారు.

కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన తర్వాత పార్టీలో ఏర్పాటు చేసిన పెద్ద సమావేశంలో.. మంత్రుల పదవులు ఎంత పరిమితమన్న విషయాన్ని క్లియర్ గా చెప్పేయటమే కాదు..వారానికి రెండురోజులు మాత్రమే మంత్రిత్వ శాఖ పనులు చూడాలని.. మిగిలిన రోజులు మొత్తం పార్టీకి.. కార్యకర్తల కోసం పని చేయాలని చెప్పిన తీరు చూస్తే.. వారి పాత్ర ఎంతన్న విషయాన్ని చెప్పేశారు.

అంతేనా.. మంత్రుల కంటే కూడా పార్టీ ప్రాంతీయ సమన్వయ కర్తలు.. జిల్లా పార్టీ అధ్యక్షులే కీలకమని.. వారి కంటే మంత్రుల స్థాయి చిన్నదన్న భావన కలిగేలా సీఎం జగన్ మాటలు ఉండటం తెలిసిందే. దీంతో పాత మంత్రులు పెద్దగా ఫీల్ కానప్పటికీ.. కొత్తగా మంత్రిపదవులుచేపట్టిన వారు మాత్రం ఒక్కసారిగా నీరసపడిపోయినట్లు చెబుతున్నారు.

ఇదిలా ఉంటే.. .ఈ సమీక్షకు వచ్చిన ప్రకాశం జిల్లా నేతలకు ఊహించని షాకు తగిలినట్లుగా చెబుతున్నారు.

ఎందుకంటే.. మంత్రి పదవుల ఎంపిక తర్వాత జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలపై సీఎం జగన్ గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. మిగిలిన జిల్లాలలో పోలిస్తే.. ప్రకాశం జిల్లాలో ధిక్కార స్వరం కాస్త బలంగా వినిపించిన నేపథ్యంలో.. దాన్ని సెట్ చేసే పనిలో సీఎం జగన్ వ్యవహరించినట్లుగా ఆయన తీరును చూసిన వారు విశ్లేషిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని స్థానాల్ని సొంతం చేసుకోవాల్సి ఉంటుందని.. అందుకు తగ్గట్లుగా నేతలు పని చేయాలన్న  విషయాన్ని వారికి స్పష్టం చేసినట్లుగా తెలుస్తోంది.

అంతేకాదు.. క్రమశిక్షణ లైన్ దాటితే చర్యలు తప్పవన్న విషయాన్ని ఆయన కరాఖండిగా చెప్పినట్లుగా తెలుస్తోంది. వాళ్లు.. వీళ్లు అన్నది చూడనని.. పార్టీకి క్రమశిక్షణ చాలా ముఖ్యమని.. దాన్ని ధిక్కరించే వారు ఎవరైనా సరే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేసినట్లుగా చెబుతున్నారు. మిగిలిన జిల్లాలతో పోలిస్తే.. ప్రకాశం జిల్లా నేతల విషయంలో సీఎం జగన్ గొంతు కటువుగా ఉందన్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News