విలువైన వస్తువులు గుళ్లల్లో మిస్ కావటం మొదట్నించి ఉన్నదే. ఈ మధ్యన తిరుమల గుడిలో విలువైన వజ్రం మిస్ అయ్యిందన్న రచ్చ బాబు ప్రభుత్వాన్ని ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో తెలిసిందే. ఈ వజ్రంపై బాబు సర్కారు ఎన్ని మాటలు చెప్పినా.. ప్రజల అనుమానాలు మాత్రం తీరని పరిస్థితి. ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక గుడికి ఇచ్చిన చీర మిస్ అయిన ఉదంతం ఇప్పుడు సంచలనంగా మారింది.
వజ్రాలు.. బంగారు ఆభరణాలు లాంటివి మిస్ కావటం అప్పుడప్పుడు జరిగినా.. ప్రముఖులు ఇచ్చే చీరలు లాంటి వస్తువులు మిస్ కావటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
ముఖ్యమంత్రి దంపతులు స్వయంగా అమ్మవారికి ఇచ్చిన ఈ పట్టుచీర కనిపించటం లేదన్న విషయం కొద్ది రోజుల కిందట వెలుగులోకి వచ్చింది. సీఎం అందునా కేసీఆర్ దంపతులు ఇచ్చిన పట్టుచీర మిస్ అయ్యిందన్న వార్త బయటకు రాకుండా వచ్చేందుకు చాలానే ప్రయత్నాలు చేసినా.. అవి ఫలించలేదు. మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. మిస్ అయిన స్థానంలో మరో చీరను తీసుకొచ్చి ఉంచటం.
ముఖ్యమంత్రి ఇచ్చిన పట్టుచీర మిస్ అయ్యిందని.. కొందరి నిర్లక్ష్యంతోనే అది పోయిందన్న వాదన వినిపిస్తోంది. ఈ విషయం బయటకు వస్తే ఆలయ పరువు బజరాన పడటంతో పాటు.. సీఎం ఆగ్రహాన్ని భరించటం కష్టమవుతుందన్న ఉద్దేశంతో లోగుట్టు వ్యవహారాన్ని చేపట్టినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.సీఎం కేసీఆర్ ఇచ్చిన పట్టుచీర స్థానే.. అలాంటి చీరనే మరొకటి తీసుకొచ్చి దాని స్థానంలో ఉంచినట్లుగా చెబుతున్నారు.
అయితే.. ఈ వైనాన్ని ఆలయానికి చెందిన వారు బయటకు లీక్ చేయటంతో ఈ ఇష్యూ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన చీర నెమలి కంఠం రంగులో ఉంటుందని.. కానీ.. ఇప్పుడు ఆలయ అధికారులు చూపిస్తున్న చీర ముదురు నీలం రంగులో ఉండటాన్ని చూపిస్తున్నారు. తాజాగా హాట్ టాపిక్ గా మారిన సీఎం బహుకరించిన చీర ముచ్చట ఆలయ అధికారులు.. అర్చకుల గుండెల్లో రైళ్లు పరిగెత్తేలా చేస్తున్నాయి. సీఎం బహుకరించిన చీరగా చూపిస్తున్నది నిజమైనదా? నకిలీదా? అన్నది తేల్చే పనిలో పోలీసులు ఉన్నారు. ఇప్పటివరకూ గుట్టుచప్పుడు కాకుండా ఉన్న ఈ విషయం బయటకు రావటంతో కేసీఆర్ రియాక్షన్ ఎంత తీవ్రంగా ఉంటుందోనన్న భయాందోళనలో ఆలయ వర్గాలు ఉన్నట్లు చెబుతున్నారు.
వజ్రాలు.. బంగారు ఆభరణాలు లాంటివి మిస్ కావటం అప్పుడప్పుడు జరిగినా.. ప్రముఖులు ఇచ్చే చీరలు లాంటి వస్తువులు మిస్ కావటం ఇప్పుడు కలకలం రేపుతోంది.
తెలంగాణ రాష్ట్ర కల నెరవేరితే.. పలు గుళ్లల్లో పలు మొక్కులు మొక్కుకున్న కేసీఆర్.. వాటిని క్రమపద్ధతిలో మొక్కులు తీర్చుకున్న వైనం తెలిసిందే. తన మొక్కుల్లో భాగంగా భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం కాళేశ్వర క్షేత్రంలో కొలువైన శుభానందదేవికి 2016 మేలో పట్టుచీరను సమర్పించారు.