అవుటాఫ్ బాక్స్ కు వెళ్లి ఆలోచించటం అంత చిన్న విషయం కాదు. అత్యున్నత స్థానాల్లో ఉన్న వారిలో కొందరు మాత్రం అలాంటి పనులు చేస్తారు. తాజాగా అలాంటి దిశగా ఆలోచనలు చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. ఏదైనా విషయం మీద ఆయన ఫోకస్ పెడితే.. దాని మీద ఎన్ని విమర్శలు వచ్చినా.. ఎంతమంది వ్యతిరేకించినా ఒక్కసారి డిసైడ్ అయ్యాక వెనక్కి తగ్గటం అనేదే ఉండనట్లుగా వ్యవహరిస్తుంటారు.
తాజాగా అలాంటి తీరును మరోసారి ప్రదర్శించారు కేసీఆర్. గడిచిన కొన్ని నెలలుగా ప్రభుత్వంలో అత్యంత కీలకమైన రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయటంతో పాటు.. దాని రూపురేఖల్ని పూర్తిగా మార్చేయాలన్న గట్టి పట్టుదలతో ఉన్నారు కేసీఆర్. దీనికి సంబంధించిన కసరత్తు ఇటీవల కాలంలో భారీగా చేపట్టారు. అయితే.. రెవెన్యూ శాఖను ప్రక్షాళన చేయాలన్న ఆలోచనపై ఆ శాఖ ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయినప్పటికీ కేసీఆర్ వెనక్కి తగ్గటం లేదు.
ఇదిలా ఉంటే.. తాజాగా తాను అనుకుంటున్నట్లుగా రెవెన్యూ శాఖ ఎలా ఉండాలి? ఏం పనుల్ని చేయాలి? అధికారుల విధులు ఏం ఉండాలి? లాంటి అంశాలకు సంబంధించి ఇప్పటికే విధివిధానాల్ని రూపొందిస్తున్నకేసీఆర్.. ఇప్పుడీ శాఖకు ఏం పేరు పెట్టాలన్న దానిపై భారీగా కసరత్తు జరుపుతున్నారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. రెవెన్యూ శాఖకు భూమాత అన్న కొత్త పేరు పెట్టే అంశంపై కేసీఆర్ సానుకూలంగా ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్లతో సమావేశమైన వేళ.. ఈ విషయాన్ని చెప్పినట్లుగా తెలుస్తోంది.
రెవెన్యూ శాఖలో అత్యధికం భూములకు సంబంధించిన అంశాలే ఉంటాయని.. అందుకే.. భూమికి సంబంధించి భూమాత పేరునే శాఖకు పెడితే బాగుంటుుందన్న ఆలోచనను ఆయన వ్యక్తం చేసినట్లు సమాచారం. గతంలో మాదిరి భూములకు ఎలాంటి శిస్తు లేనందున.. రెవెన్యూ పదాన్ని తొలగించి.. భూమికి సంబంధించిన అంశం కాబట్టి.. భూమాత అయితే కరెక్ట్ గా సరిపోతుందన్న కేసీఆర్ మాటకు ఎక్కువ మంది కలెక్టర్లు ఓకే అన్నట్లుగా చెబుతున్నారు. ఒకవేళ.. ఇదే పేరును కేసీఆర్ డిసైడ్ చేస్తే మాత్రం.. రెవెన్యూ శాఖకు ఇంత చక్కటి పేరు పెట్టిన ఘనత కేసీఆర్ కు దక్కుతుందనటంలో సందేహం లేదని చెప్పాలి.