హైదరాబాద్ రూపులేఖలు మార్చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుంది అని మంత్రి కేటీఆర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో.. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో మాట్లాడుతూ అన్నారు. ఆరున్నరేళ్లుగా నగరం ఎంతో ప్రశాంతంగా ఉండి, అభివృద్ధి పథంలో దూసుకెళ్తోందని , గ్రేటర్ ఎన్నికల్లో ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలుస్తుందని, బల్దియాపై గులాబీ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తంచేశారు. కేసీఆర్ ఉద్యమ నాయకుడిగా పదవీ బాధ్యతలు చేపట్టకముందు, ఎన్నో విమర్శలు చేసినా… అసాధారణ పరిణతి చూపించారని కేటీఆర్ అన్నారు.
జూన్ 2న 2014లో తెలంగాణ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత కనీస అవసరాలు, మౌలిక వసతులు, ప్రాథమిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని పని చేశామని అన్నారు. తెలంగాణకు పెట్టుబడులు రావని ప్రచారం చేశారని, ఇప్పుడు దేశం మొత్తం తెలంగాణ వైపు చూస్తోందన్నారు. గతంలో ఎండాకాలం వస్తే జలమండలి ఎదుట ధర్నాలు జరిగేవని, శివారు ప్రాంతాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. మెట్రో నగరాల్లో పారిశుద్ధ్య నిర్వహణలో హైదరాబాద్ ముందుందన్నారు. త్వరలో హైదరాబాద్‌లో రెండు చెత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో పేకాట క్లబ్‌లు లేవు, గుడుంబా గబ్బులు లేవని.. పోకిరీలు, ఆకతాయిల ఆగడాలకు కేసీఆర్ ప్రభుత్వంలో అడ్డుకట్ట పడిందని మంత్రి కేటీఆర్ తెలిపారు.
గతంలో 14 రోజులకు ఓసారి నీళ్లు వచ్చేవని.. ఇప్పుడా పరిస్థితి లేదని వెల్లడించారు. 1916లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, 1920 గండిపేట జలాశయాలను కట్టారన్న ఆయన.. ఆ తర్వాత ఎవరూ తాగునీటిపై దృష్టిపెట్టలేదని చెప్పారు. కానీ తమ ప్రభుత్వం భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని.. 2020లో కేశావపురం రిజర్వాయర్ కడుతున్నట్లు తెలిపారు. చెత్త నుంచి కూడా సంపద సృష్టించవచ్చని నిరూపించామన్న మంత్రి కేటీఆర్.. జీడిమెట్లలో ప్లాంట్ నిర్మించినట్లు తెలిపారు.