తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పై మరో ఆరోపణ వచ్చింది. మంత్రులను పరిగణనలోకి తీసుకోకుండా వాళ్ల శాఖల నిర్ణయాలు తీసుకుంటారనే అపప్రద ఇప్పటికే కేసీఆర్ మూటగట్టుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర బడ్జెట్ ను రూపొందించే క్రమంలో ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్ లేకుండానే కేసీఆర్ స్వయంగా రూపొందించినట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తికరమైన పథకమైన హరితహారంపై అదే రీతిలో జరిగిందని అంటున్నారు. హరితహారంపై ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు - అటవీ - పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న బుధవారం వేర్వేరుగా సమీక్షలు నిర్వహించడం చర్చనీయాంశమైంది. ఒకేరోజు ఇరువురు పెద్దలు ఒకే అంశంపై ఉన్నతాధికారులు, ఇతర అధికారులతో సమావేశాలు పెట్టడం ఒకింత ఆసక్తిని రేపింది. రాజకీయ చర్చకు దారితీసింది.
హరితహారంపై మంత్రి జోగురామన్న ఉదయం నిర్వహించగా, సీఎం కేసీఆర్ సాయంత్రం జరిపారు. ఇటు ప్రగతిభవన్ - అటు అరణ్యభవన్ ఈ సమీక్షలకు వేదికలయ్యాయి. దీంతో ఉన్నతాధికారులు - అటవీశాఖ అధికారులు ఏటుపోవాలో తేల్చుకోలేక తలలు పట్టుకోవాల్సి వచ్చిందని అంటున్నారు. అయితే సీఎం దగ్గర జరిగిన సమావేశానికి అటవీశాఖ మంత్రికి ఆహ్వానం అందలేదని, అసలు సమాచారమే లేదని ప్రచారం జరుగుతోంది. కాగా ఆ పేషీవర్గాలు మాత్రం తమకు సమాచారం ఉందని, తమకు ముందే నిర్ణయించుకున్న ఇతర కార్యక్రమాలు ఉండటంతో సీఎం సమీక్షకు హాజరు కాలేకపోయినట్టు వివరణ ఇచ్చుకున్నారు. మరోవైపు సంబంధిత మంత్రి లేకుండా ఆయనను పట్టించుకోకుండా సీఎం సమావేశం నిర్వహించారనే ప్రచారమూ జరిగింది. సీఎం సమావేశానికి సీఎం ముఖ్యకార్యదర్శి ఎస్ నర్సింగ్ రావు - కార్యదర్శి స్మితాసబర్వాల్ - సీఎం ఓఎస్డీ - హరితహారం ఇన్ చార్జి ప్రియాంకవర్గీస్ హాజరయ్యారు. అలాగే మంత్రులు తుమ్మల నాగేశ్వర్ రావు - ఎ ఇంద్రకరణ్ రెడ్డి - ప్రభుత్వ సలహాదారు రమణాచారి - ఎంపీ బాల్క సుమన్ సైతం పాల్గొన్నారు. మంత్రి దగ్గర జరిగిన సమీక్షకు అటవీ శాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ - పీసీసీ ఎఫ్ ప్రశాంత్ కుమార్ ఝూ - అదనపు పీసీసీఎఫ్ లు ఆర్ ఎం డోబ్రీయాల్ తదితరులు వచ్చారు.
ఇదిలాఉండగా సీఎం సమీక్షా సమాచారం ముఖ్యకార్యదర్శికి ఉన్నప్పుడు, మంత్రికి లేకపోవడంపై చర్చ జరుగుతున్నది. దీంతో ఉన్నతాదికారులు డోలాయమానంలో పడ్డారు. ప్రగతిభవన్ లోని సీఎం సమీక్షకు వెళ్లాలా ? అరణ్యభవన్ లోని మంత్రి భేటికి హాజరు కావాలా ? అనే విషయమై గందరగోళాన్ని ఎదుర్కొన్నారు. మంత్రి వాల్ పోస్టర్లు, స్టిక్కర్లను ఆవిష్కరించగా, సీఎం సాధారణ సమీక్ష చేపట్టారు. కరీంనగర్ లో ఈనెల 12న జరగనున్న హరితహారంలో ఒకే రోజు లక్ష మొక్కలు నాటాలని సీఎం కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తొలి రోజు 25 వేల మొక్కలు, తరువాత రోజుకు 5 వేల మొక్కల చొప్పున 75 వేల మొక్కలను 15 రోజులపాటు నాటాలని ఆదేశించారు. మొక్కలను నాటడం, రక్షించడం కోసం ఎక్కడికక్కడ గ్రీన్ బ్రిగేడ్లను ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రీ గార్డులు ఏర్పాటు చేయడంతోపాటు, వర్షాలు లేని సమయంలో నీళ్లుపోయడం తదితర పనులు చేయాలని కోరారు.