``తెలంగాణ కోసం టీఆర్ఎస్ పుట్టినట్లే.. దేశం కోసం ఒక శక్తి తప్పకుండా పుడుతుంది. ఈ దేశం కోసం టీఆర్ఎస్ ఉజ్వలమైన పాత్ర పోషిస్తుంది. తెలంగాణ ఉద్యమం తరహాలోనే భూకంపం పుట్టించి – విద్రోహ శక్తులను తరిమికొడుదాం.`` టీఆర్ఎస్ పార్టీ 21వ ప్లీనరీ వేదికగా సీఎం కేసీఆర్ దేశంలో జరుగుతున్న పరిణామాలపై ఆగ్రహం వ్యక్తం చేసి తాము ఏం చేయబోతున్నామో తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)ని భారతీయ రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) చేయాలని కొంతమంది ఎమ్మెల్యేలు కోరుతున్నారని తన మనసులోని మాటను బయటపెట్టారు. అయితే, కేసీఆర్ జాతీయ రాజకీయాల కలలకు `లెక్కలు` అడ్డు వస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు.
గతంలో ఎన్టీఆర్, చంద్రబాబు జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పిన ఉదంతాలను గుర్తు చేసుకుంటూ వారిలా తాను కూడా చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు. అయితే, ఎన్టీఆర్, చంద్రబాబు హయాం నాటి రాజకీయానికి నేటికి చాలా తేడా ఉందని చెప్తున్నారు. అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో ఆ పార్టీకి ఎంపీ స్థానాలు ఎక్కువగా ఉండి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీకి తక్కువ సీట్లు ఉండేవి. కానీ ఇప్పుడు బీజేపీ చేతిలో తిరుగులేని స్థానాలు ఉన్నాయి. ఇదే సమయంలో తెలంగాణలో ఉన్న ఎంపీ సీట్లు మరో ప్రధాన అంశం.
జాతీయ రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయిలో తెలగాణలోని ఎంపీ సీట్ల సంఖ్య లేదన్నది నిజం. పైగా తెలంగాణలోని మొత్తం ఎంపీ సీట్లలో అన్నీ టీర్ఎస్ ఖాతాలోనే లేవు. బీజేపీ , కాంగ్రెస్ సైతం బలమైన వాటాను ప్రస్తుతం కలిగి ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఆ పార్టీలు చెప్పుకోదగ్గ సీట్లను కైవసం చేసుకునే అవకాశాలున్నాయి. ఈ నేపథ్యంలో తనకున్న పరిమిత ఎంపీల సంఖ్యతో జాతీయ రాజకీయాలను కేసీఆర్ ఎలా ప్రభావితం చేయగలరు అనే సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు.