అంకెలు మా గొప్ప చిత్రమైనవి. చెప్పేవాడిలో సామర్థ్యం ఉండాలే కానీ.. బుద్ధిగా చెప్పినట్లుగా వింటాయి. కనిపించే అంకెలు ఒకటే అయినా.. ఆ అంకెల్ని తనకు తగినట్లుగా చెప్పేవాడికి అనుగుణంగా అంకెలు కనిపించటం ఒక ప్రత్యేకత. ఈ పోలిక కాస్త గందరగోళంగా అనిపించినా.. విషయంలోకి వెళితే ఇట్టే అర్థమవుతుంది. బేసిగ్గా ఎంత మొనగాడైనా సరే.. అప్పులు చేయాల్సిన అవసరం ఎందుకు ఉంటుంది? మీరో ఫుల్ క్యాష్ పార్టీ అనుకోండి. మీరు బ్యాంకుల దగ్గరకు వెళ్లి వారు అడిగిన ప్రశ్నలకు బుద్ధిగా సమాధానం చెప్పి.. వారు చెప్పిన రేటుకు వడ్డీ చెల్లిస్తానని మాట ఇచ్చి.. వారు కోరుకున్న చోట సంతకాలు చేసి.. అప్పు తీసుకుంటారా? నాకెందుకీ తలనొప్పులు.. నా దగ్గర ఉన్న క్యాష్ తో ఖర్చులు చేస్తా? అని అంటారా?
ఎవరైనా సరే.. లెక్కల్లో ఎంత మొనగాడైనా సరే.. చేతిలో డబ్బులు ఉంటే.. అక్కడెక్కడికో వెళ్లి అప్పులు చేసే కన్నా.. సొంత డబ్బుతో ఖర్చులు చేస్తానని చెబుతారు. అంటే.. అప్పులు చేయటం అంటే.. ఆస్తులు వెనుక ఎంత ఉన్నా.. చేతిలో పైసలు లేనట్లే లెక్క. మరి.. అలాంటప్పుడు చేసే అప్పులు ఆచితూచి చేయాల్సిన అవసరం ఉందా? లేదా? ఇదే విషయాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు చెబితే కోపం వచ్చేస్తుంది. అప్పుల మీద ఎందుకంత రంధి. నాకు తెల్వదా? అప్పుల గురించి ఫికర్ పడకండంటూ కసరుకుంటారు.
ఇన్నేసి వేల కోట్లు అప్పులు తెచ్చేసి సంక్షేమ పథకాలకు ఖర్చు చేసేస్తే.. వాటిని వడ్డీతో సహా చెల్లించాల్సింది ఎవరు? పన్నులు కట్టే జనాలే. అంటే.. పన్నులు కట్టేవాడు నిత్యం పన్నులు కడుతూ ఉంటాడే తప్పించి అతగాడికి ఎలాంటి ప్రయోజనం ఉండదు. ప్రయోజనం సంగతి తర్వాత.. పన్ను చెల్లింపుదారులకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందా? అంటే అదీ ఉండదు. వీటిని పక్కన పెడితే.. అప్పులు చేసేటప్పుడు ఆచితూచి చేయండని ఎవరైనా కేసీఆర్ కు చెబితే ఆయన కసరుకుంటారు. మనకున్న ఆస్తులతో పోల్చినప్పుడు.. చేస్తున్న అప్పులు చాలా తక్కువని చెప్పటమే కాదు.. కేంద్రానికి.. పక్కనున్న రాష్ట్రాలకు ఉన్న లెక్కంతా చెప్పి.. వారికంటే మన అప్పులు తక్కువ కాబట్టి.. ఇప్పుడు చేసే అప్పులతో పెద్ద ప్రమాదం ఉండదని తేల్చేస్తారు.
కానీ.. ఇక్కడ మర్చిపోకూడని విషయం ఏమిటంటే.. గత పాలకులు కూడా ఇష్టారాజ్యంగా అప్పులు తెచ్చేసి ఉన్నా.. ఇప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ చెబుతున్నట్లుగా భరోసా మాటలు చెప్పి అప్పులు.. కుప్పలు తెప్పలుగా తెచ్చేసి ఉండి ఉంటే కేసీఆర్ ఈ రోజు ఇంత కులాశాగా ఇలాంటి మాటలు చెప్పేవారా? అంటే.. గత పాలకులు అప్పులు తెచ్చే విషయంలో ఆచితూచి వేసిన అడుగులే.. ఈ రోజు కేసీఆర్ భరోసాగా మాట్లాడేందుకు అవకాశం ఇస్తుందన్న విషయం మర్చిపోకూడదు.
అయితే.. ఇలాంటివేమీ పెద్దగా పట్టించుకోని కేసీఆర్ తాను తెస్తున్న అప్పుల గురించి చెబుతున్న మాటలు వింటే.. అప్పుల తేలేకపోతే తాను నడిపే సంక్షేమ బండి నడవదన్న కఠోర వాస్తవం అర్థంకాక మానదు. ఇక.. అప్పుల మీద కేసీఆర్ ధీమా చూస్తే.. ప్రస్తుతం కేంద్రం అప్పులు 47 శాతంగా ఉంటే.. తెలంగాణ అప్పులు మాత్రం 16.1 శాతంగా ఉన్నాయని చెప్పుకొచ్చారు. అంతేకాదు.. అప్పులున్న రాష్ట్రాల్లో తెలంగాణ జాబితాలో కింద నుంచి రెండోదిగా చెప్పుకొచ్చారు. సంపన్న రాష్ట్రంగా చెప్పే పంజాబ్ కు 30.2 శాతం.. గోవాకు 30.3 శాతం.. గుజరాత్ 23.5 శాతం అప్పులు ఉంటే.. తెలంగాణకు మాత్రం 16.1శాతం మాత్రమే అప్పులు ఉన్నాయన్న విషయాన్ని మర్చిపోకూడదని చెబుతుంటారు.
మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణకు తక్కువ అప్పులే ఉన్న నేపథ్యంలో తాను చేపట్టే సంక్షేమ పథకాలకు మరిన్ని అప్పులు తెచ్చినా తప్పు లేదంటూ తన వాదనను సమర్థంగా వినిపించారు. అప్పులు చేసేందుకు ఇంత సమర్థ వాదన వినిపించే బదులు.. ఒక్క ఏడాది.. భారీగా ఆదాయాన్ని చూపించి.. ఆ తర్వాత అప్పులు తీసుకొస్తానంటే ఎంత బాగుంటుంది? అలాంటి మాటలు కేసీఆర్ లాంటి నేతలు ఎందుకు చెప్పరు? ఎంతసేపటికి అప్పులే కానీ.. ఆదాయం