జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని బలంగా భావిస్తున్నతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అందుకు తగ్గట్లు భారీ రోడ్ మ్యాప్ రచించారని చెబుతారు. ఇందుకోసం ఆయన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తో కలిసి రోజుల తరబడి ప్రగతిభవన్.. ఫాంహౌస్ లలో చర్చలు జరపటం..మోడీ అండ్ కోను నిలువరించే వ్యూహాల్ని సిద్ధం చేసినట్లు చెబుతారు.
కాకుంటే.. తమతో జట్టు కట్టే వారిని ఎంపిక చేసుకునే విషయంలో వారికున్న అడ్డంకులు అన్ని ఇన్ని కావు. దీనికి తోడు.. తనకున్న పరిమితులు కూడా కేసీఆర్ కు తెలియనిది కాదు. అందుకే.. తెలంగాణ ఉద్యమ సమయంలో తనదైన సొంత మీడియా సంస్థను ఏర్పాటు చేయటం ద్వారా ప్రజల్ని ప్రభావితం చేయాలన్న ఆలోచనతో అప్పట్లో నమస్తే తెలంగాణ.. టీ న్యూస్ చానల్ ను ప్రారంభించటం తెలిసిందే.
అప్పట్లో ప్రారంభించిన టీ న్యూస్ చానళ్లకు.. ఉద్యమ వేళ బాగా కలిసి వచ్చిన పరిస్థితి. అప్పటి సెంటిమెంట్ కు తగ్గట్లు.. ఆంధ్రా యాజమాన్యపు చానళ్లకు ప్రకటనలు ఇవ్వటం సరే.. తెలంగాణ వాటా కింత తెలంగాణ యాజమాన్య హక్కులు ఉన్న తమకు ప్రకటనలు ఇవ్వాలన్న డిమాండ్ ను తీసుకురావటం ద్వారా ఏళ్ల తరబడి మీడియా వ్యాపారాన్ని చేస్తున్న వారిని సైతం కేసీఆర్ విస్మయానికి గురి చేశారని చెబుతారు. ఉద్యమం నాటి సీన్ ను తాజాగా ఆయన మరోసారి రిపీట్ చేయాలని భావిస్తున్నారా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది.
కారణంగా.. దాదాపు వారం రోజులు ఢిల్లీలో ఉన్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. అసలేం చేశారన్నదానిపై ఎవరికి ఎలాంటి క్లూ లేనప్పటికీ.. ఆయన పలువురితో వరుస భేటీలు నిర్వహించినట్లుగా చెబుతున్నారు. ఈ భేటీల్లో భాగంగానే జాతీయ స్థాయిలో ఇంగ్లిషు న్యూస్ చానల్ ఒకటి ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లుగా చెబుతున్నారు. ఉద్యమ సమయాన్ని మొదలు పెడితే ఇప్పటివరకు కూడా ఢిల్లీకి వెళ్లిన ప్రతిసారీ.. తన టూర్ లో ఎంపిక చేసిన కొద్ది మంది మీడియా ప్రముఖుల్ని పిలిపించుకోవటం.. వారితో చర్చలు జరపటం లాంటివి చేయటం గులాబీ బాస్ కు అలవాటు.
అదే తీరులో తాజాగా మరోసారి అలాంటిదే చేశారని చెబుతున్నారు. ఈసారి ఢిల్లీ టూర్ లో మీడియా ప్రతినిధుల్ని కొందరిని వేర్వేరుగా పిలిపించుకున్న సీఎం కేసీఆర్.. వారితో భేటీ అయిన సందర్భంగా.. జాతీయ స్థాయిలో తన వాదాన్ని వినిపించేలా ఇంగ్లిషు న్యూస్ చానల్ ను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు చెప్పి.. దానికి సంబంధించిన ఇన్ ఫుట్స్ ను అడిగినట్లుగా చెబుతున్నారు. సీఎం కేసీఆర్ తో మాట్లాడిన మీడియా ప్రముఖుడు.. తెలుగు మీడియా సంస్థకు చెందిన ఒక సీనియర్ జర్నలిస్టుతో చెప్పటంతో.. ఈ విషయం కాస్తా బయటకు వచ్చింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో జాతీయ స్థాయిలో ఉన్న మెజార్టీ యచానళ్లను బీజేపీ ప్రభావితం చేస్తుందని.. ఇలాంటి వేళ.. అందుకు భిన్నమైన వాదనను వినిపించేందుకు వీలుగా తానే ఒక చానల్ పెట్టనున్నట్లుగా ఆయన చెప్పినట్లుగా చెబుతున్నారు. ఈ చానల్ లో విపక్షాల గొంతుకు వేదిక కావాలన్నదే తన లక్ష్యమని చెప్పినట్లుచెబుతున్నారు. మరి.. కేసీఆర్ వారి ఇంగ్లిషు న్యూస్ చానల్ ఎప్పుడు వస్తుందో చూడాలి. ఏమైనా.. 2024 ఎన్నికలకు ఏడాది కంటే ముందే వచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది.