వ‌ర్షంతో కేసీఆర్ స‌భ క్యాన్సిల్‌.... టీఆర్ ఎస్ హ్యాపీనా...!

Update: 2019-10-17 11:01 GMT
పూజారి కోరుకునేది అదే.. దేవుడు వరం ఇచ్చింది అదే అన్న సామెత హుజూర్ నగర్ ఉప ఎన్నికల కేసీఆర్ ప్రచారంలో నూటికి నూరు శాతం నిజం అయింది. ఇప్పుడు ఈ విషయం తెలంగాణ రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. తెలంగాణలో సూర్యాపేట జిల్లా హుజూర్‌ న‌గర్ అసెంబ్లీ స్థానానికి జరుగుతున్న ఉప ఎన్నిక... అటు ప్రభుత్వాన్ని కుదిపేస్తోన్న‌ ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో తెలంగాణ రాజకీయ వాతావరణం వారం ..పది రోజులుగా ఎలా వేడెక్కిందో గమనిస్తూనే ఉన్నాం. హుజూర్ నగర్ ఉప ఎన్నికను టీఆర్ ఎస్‌ తో పాటు కాంగ్రెస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో అక్కడ అధికార పార్టీకి మరి అంత సానుకూల వాతావరణం లేదన్న నివేదికలు సీఎం కేసీఆర్‌ కు ఇప్పటికే వెళ్లిపోయాయి.

ఈ క్రమంలోనే తాను స్వయంగా ప్రచారం చేస్తే అక్కడ పార్టీ పరిస్థితి మార‌ద‌న్న‌ అంచనాకు కేసీఆర్‌ వచ్చారు. ఈనెల 19వ తేదీన ఎన్నికల ప్రచార గడువు ముగుస్తుండటంతో కేసీఆర్ గురువారం హుజూర్‌ న‌గర్ లో భారీ బహిరంగ సభలో ప్రసంగించేందుకు రెడీ అయ్యారు. ఉప ఎన్నికల ప్రచారానికి కేసీఆర్ వస్తుండడంతో అధికార టీఆర్ ఎస్ పార్టీ నేతలు ఈ స‌భ‌ను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పెద్ద ఎత్తున జన సమీకరణ చేశాయి. సూర్యాపేట - నల్గొండ - జనగామ - మహబూబాబాద్ - యాదాద్రి జిల్లాల నుంచి భారీ ఎత్తున జనసమీకరణ చేశారు.

గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం విరుచుకుపడింది. గంటసేపటి నుంచి కుండపోతగా వర్షం కురుస్తుండటంతో సభాప్రాంగణం అస్తవ్యస్తంగా మారిపోయింది. సభా ప్రాంగణంలో నీళ్లు చేరి.. బురదమయంగా అయింది. చివ‌ర‌కు స‌భ‌ను ర‌ద్దు చేశారు. మరోవైపు ప్ర‌చారానికి రెండు రోజుల టైం మాత్ర‌మే ఉంది. అటు ఆర్టీసీ స‌మ్మెతో ఉక్కిరి బిక్కిరి అవుతోన్న అధికార పార్టీకి కేసీఆర్ స‌భ‌తో అయినా జోష్ వ‌స్తుంద‌ని ఆ పార్టీ నేత‌లు భావించారు. వాస్త‌వంగా మాత్రం స‌భ జ‌రిగితే ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో కేసీఆర్‌ కు కార్మికుల నుంచి నిర‌స‌న‌లు త‌ప్ప‌వ‌ని.. అది మ‌రింత ఎఫెక్ట్ అవుతుందేమోన‌న్న సందేహాలు ముందు నుంచి ఉన్నాయి.

పార్టీ అధిష్టానంలోనే అక్క‌డ కేసీఆర్ స‌భ నిర్వ‌భించ‌డం ఇష్టం లేదు. ఇప్పుడు వ‌ర్షం రూపంలో స‌భ క్యాన్సిల్ అవ్వ‌డంతో వాళ్లు మాత్రం హ్యాపీగానే ఉండొచ్చు. మ‌రోవైపు ఉప ఎన్నిక బాధ్య‌త‌ల‌ను చూస్తోన్న ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్‌ రెడ్డి - మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌ రెడ్డి - సత్యవతి రాథోడ్ మాత్రం నిరాశ‌లో కూరుకుపోయారు. ఇక కేసీఆర్ క‌రెక్టుగా స‌భా ప్రాంగ‌ణానికి బ‌య‌లు దేరుతార‌న‌గా వ‌రుణుడు ప్రాంగ‌ణాన్ని ముంచెత్త‌డంతో స‌భ‌కు బ్రేక్‌ పడింది.


Tags:    

Similar News