తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ముగిశాక నేతలంతా రిలాక్స్ అయ్యారు. మే 23న ఫలితాల కోసం అందరూ ఎదురుచూస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి - టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పుడు తన దృష్టిని ఏపీ పాలిటిక్స్ పై మళ్లించినట్లు సమాచారం. ఫలితాలకు మూడువారాలే ఉండడంతో తరువాతి కార్యక్రమాలపై దృష్టి సారించారు.
తాజాగా కేసీఆర్ ప్రగతి భవన్ లో టీఆర్ ఎస్ సీనియర్ నేతలు - ముఖ్యులతో ఏపీ పాలిటిక్స్ పై సీరియస్ చర్చలు చేసినట్లు సమాచారం. ఆ తర్వాత జరిగిన టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు - ఎంపీల సమావేశంలో కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మే 23 ఫలితాల తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి తాను హాజరు కావాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాదు... ఏపీ అసెంబ్లీ పోలింగ్ సరళి చూశాక తనకు 100శాతం వైఎస్ జగన్ గెలిచి ఏపీ ముఖ్యమంత్రి అవుతాడని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.
ఈ భేటిలో కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలిసింది.. ‘తాను జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారానికి హాజరైతే.. తాను చంద్రబాబుకు ఇస్తానన్న రిటర్న్ గిఫ్ట్ 100శాతం పూర్తి అవుతుందని.. ప్రస్తుతం ఆ రిటర్న్ గిఫ్ట్ ప్రాసెస్ లో ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తాను జగన్ ప్రమాణానికి వెళ్లాక అక్కడ తన రిటర్న్ గిఫ్ట్ ఏంటో బాబుకు అర్థం అవుతుందని అన్నట్టు సమాచారం.
అయితే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో జగన్ గెలుస్తాడా అని టీఆర్ ఎస్ నేతలు అడగగా.... కేసీఆర్ ఆసక్తికరంగా సమాధానమిచ్చారు. ‘తాను సొంతంగా కొన్ని కీలక సర్వేలు చేశాను. రిపోర్టులు తెప్పించుకున్నాను. నేను చేసిన సర్వే రిపోర్టులు ఎప్పుడూ తప్పుకాలేదు. అన్ని సర్వేలు జగన్ గెలుస్తాడనే చెబుతున్నాయి. అన్ని సమీకరణాలను పరిగణలోకి తీసుకున్నాకే.. జగన్ గెలుస్తాడని నిర్ధారించుకొని ఆయన ప్రమాణ స్వీకారానికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.
జగన్ గెలిస్తే తాను అనుకుంటున్న ఫెడరల్ ఫ్రంట్ కు మరింత బూస్ట్ ను ఇచ్చినట్టు అవుతుందని కేసీఆర్ అభిప్రాయపడ్డట్టు తెలిసింది. అంతేకాదు..చంద్రబాబు ఓటమితో జాతీయ రాజకీయాల్లో ఆయన పాత్ర కూడా ముగిసిపోతుందని వ్యాఖ్యానించారు. ఓడిపోతే జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ ను పట్టించుకోరని కుండబద్దలు కొట్టినట్టు తెలిసింది. తనతోపాటు తన కూతురు కవిత కూడా జగన్ ప్రమాణ స్వీకారానికి హాజరవుతారని కేసీఆర్ అన్నట్లు తెలిసింది.