ఏదైనా అంశం మీద ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి రివ్యూ అంటే ఎంతసేపు ఉంటుంది? పావు గంట.. అరగంట.. గంట.. లేదంటే రెండు గంటలు.. కాదూ కూడదంటే మూడు గంటలు. అది కూడా చాలా అరుదుగానే. కానీ.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ భిన్నంగా ఉంటుంది. సీఎం అయినప్పటికీ పెద్దగా బయటకు రాని ఆయన.. ఏదైనా విషయం మీద ఫోకస్ పెడితే మాత్రం గంటల తరబడి అదే ఇష్యూ మీద ఉంటారు. మరే విషయాల్ని అస్సలు పట్టించుకోరు.
గంటల కొద్దీ నాన్ స్టాప్ గా పని చేసే కేసీఆర్ స్టైల్ తెలిసిన వారు.. తాము అలాంటి సీన్లలో చిక్కుకోకూడదని భావిస్తుంటారు. తాజాగా ఇలాంటి అనుభవాన్ని ఎదుర్కొన్నారు యాదాద్రి అధికారులు.. సిబ్బంది. సీఎం కేసీఆర్ కలల పంటగా చెప్పే యాదాద్రి ఆలయాన్ని పరిశీలించేందుకు.. నిర్మాణ పనుల్లో వేగాన్ని అంచనా వేసేందుకు వీలుగా పర్యటన చేపట్టిన కేసీఆర్.. అనూహ్యంగా తొమ్మిది గంటల పాటు ఇదే అంశం మీద ఉండటం.. వరుస పెట్టి చేపట్టిన కార్యక్రమాలతో అధికారులు.. సిబ్బంది ఆగమాగం అయ్యారు. రోడ్డు మార్గంలో ఉదయం 11.10 గంటలకు యాదాద్రి చేరుకున్న కేసీఆర్.. వచ్చిన క్షణం నుంచి దేవాలయాన్ని పరిశీలించటం.. జరుగుతున్న పనుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఆలయంలో జరుగుతున్న నిర్మాణ పనుల్నే దాదాపుగా మూడు గంటల పాటు ప్రత్యక్షంగా పరిశీలించటం చూసిన అధికారులకు తడి ఆరిపోయిన పరిస్థితి. ఇక.. మిగిలిన ఐదు గంటలు రివ్యూ చేసిన తీరుతో కళ్లు తేలేసిన పరిస్థితి. మధ్యలో ఎలాంటి బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ గా రివ్యూ బ్యాటింగ్ చేసిన కేసీఆర్ స్టామినాకు అక్కడి వారంతా అవాక్కు అయిపోయిన పరిస్థితి.
తానెంతో ప్రాధాన్యత ఇచ్చే యాదాద్రి ఆలయ పనుల విషయంలో కేసీఆర్ రివ్యూ చర్చనీయాంశంగా మారింది. ఇన్నేసి గంటల సమయాన్ని కేటాయించటం ద్వారా యాదాద్రి ఆలయానికి తానిచ్చే ప్రాధాన్యత ఎంతన్న విషయాన్ని కేసీఆర్ స్పష్టం చేశారని చెప్పాలి. నిధుల కొరత ఎదుర్కొంటూ పనులు ఆలస్యమవుతున్నాయన్న విషయం కేసీఆర్ వద్దకు వెళ్లినంతనే తక్షణం రూ.54 కోట్లు విడుదల చేసిన కేసీఆర్.. పదిహేనురోజుల వ్యవధిలో రూ.470 కో్ట్లను విడుదల చేస్తామని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసేలా చేశారు.
ఎందుకిలా అంటే ఇప్పటివరకూ యాదాద్రికి ప్రభుత్వం పెట్టిన ఖర్చు రూ.692 కోట్లు కాగా.. ఇప్పుడింత స్వల్ప వ్యవధిలో ఇంత భారీగా నిధులు విడుదల చేయటం ద్వారా.. పనులు ఎంత వేగంగా సాగాలన్న విషయాన్ని స్పష్టంగా చెప్పేశారని చెప్పాలి. యాదాద్రి పనుల విషయంలో కేసీఆర్ ప్రదర్శిస్తున్న పట్టుదల..అన్నేసి గంటలు కేటాయించిన తీరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నాన్ స్టాప్ రివ్యూతో అధికారుల కళ్లు తేలేసేలా చేసిన కేసీఆర్.. మరోసారి తన స్టామినా ఏమిటో చెప్పేశారని చెప్పాలి.