తెలంగాణ సీఎం కేసీఆర్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన కుమారుడితో సమానంగా ఉండే నేత ఎవరో ఆయన వెల్లడించారు. తమ కుటుంబానికి సన్నిహితంగా ఉండే నేత - యువకుడు బాల్క సుమన్ కు కీలక హోదా కట్టబెట్టారు. ఇప్పటికే ఆయన్ను ఎంపీగా చేసిన గులాబీ పార్టీ నేత తాజా ఎన్నికల్లో ఆయనకు ఎమ్మెల్యేగా చాన్సిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా సుమన్ గెలుపుకోసం బహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్... సుమన్ తన కుమారుడితో సమానమని ప్రకటించారు. తద్వారా ఆయనకు విశేషమైన గౌరవం కల్పించారు.
చెన్నూరు నియోజకవర్గం మందమర్రి సభలో సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ... ``బాల్క సుమన్ ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి నాయకుడిగా ఉండేవాడు. వందలాది కేసులు ఆయన మీద పెట్టిన్రు. నెలల తరబడి జైళ్లలో ఉన్నడు. ఏ ఒక్క రోజు కూడా మడమ తిప్పలే..భయపడలేదు. సుమన్ రెండు నెలలు చంచల్ గూడ జైలులో ఉండి విడుదలై వచ్చిండు. సుమన్ భయపడ్డవా అని నేను అడిగితే..మీరుండగా నాకేం భయం సార్..ఎంతవరకైనా పోతానన్నాడు. అట్లా పోరాటం చేసిండని సీఎం తెలిపారు. ఇప్పటికీ కూడా కొన్ని వందల కేసులున్నాయి` అని అన్నారు.
తన మీద 3672 కేసులు పెట్టారని సీఎం కేసీఆర్ అన్నారు. ``రాష్ట్రం మొత్తంలో నా మీద కేసు పెట్టని పోలీస్ స్టేషనే లేకుండే. ఇపుడు ఆంధ్రాలో ఉన్న ఏరియాలో కూడా కేసు పెట్టిన్రు. ఉద్యమ కేసులన్నీ రద్దు చేసినం. అన్ని పోగా ఇపుడు నా మీద 64 కేసులున్నాయి. అట్లే సుమన్ మీద కూడా ఆ రోజు పెట్టిన కేసులున్నాయి. సుమన్ మీద మీ అందరి దీవెన ఉండాలే. ఆయనకు పదవి లేక కాదు. లోక్ సభ స్థానానికి వేరే ఆలోచించుకుందామని నేనే సుమన్ ను పిలిచి ఇక్కడ నిలబెట్టిన. సుమన్ నా ఇంట్లో బిడ్డలాంటివాడు. నా కొడుకు రామారావు ఎంతో సుమన్ కూడా అంతే. నా ఇంట్లో నాతోపాటు సందర్భం వచ్చినపుడు నా పక్కనే కూర్చొని భోజనం చేస్తడు. మీ ప్రాంతం అభివృద్ధికి ఏం కావాలన్నా..నాతోని కొట్లాడి తెచ్చేంత శక్తి సుమన్ కు ఉంది. చెన్నూర్ నియోకవర్గంలో సుమన్ ను గెలిపిస్తే...నా కొడుకును గెలిపించినట్లే. సుమన్ ను భారీ మెజార్టీతో గెలిపించండి. ఆయన గెలిస్తే సాధారణ ఎమ్మెల్యేగా ఉండడు. ఉన్నతమైన స్థానంలో ఉంటడు. మీకు చాలా లాభం జరుగుతది. పెద్ద ఎత్తున ఓటేసి సుమన్‌ను గెలిపించండి..మీ చెన్నూరు నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా` అని సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు.
చెన్నూరు నియోజకవర్గానికి లక్ష ఎకరాలకు నీరు తెచ్చి ఇచ్చే బాధ్యత తనదని సీఎం కేసీఆర్ అన్నారు. ``రాబోయే ఏడాదిన్నర లోపల వంద శాతం నీళ్లు తెచ్చే బాధ్యత నాది. మందమర్రిలో ఇప్పటివరకు ఎన్నికలే జరగలే. ఆదిలాబాద్ లో ఉట్నూరు - మందమర్రి ఎజేన్సీ ఏరియాలు కాబట్టి..గవర్నర్ నోటిఫై చేసి..రాష్ట్రపతి నోటిఫై చేయాలన్నారు. తక్షణమే ప్రతిపాదన పంపించినం. ఆదేశాలు కూడా వస్తయి. ఈ సారి అన్నింటితోపాటు మీకు కూడా ఎన్నికలు జరుగుతుంది` అని సీఎం తెలిపారు.