కోర్టు మాట‌ల‌తో సీన్లోకి దిగిన కేసీఆర్..త‌ర్వాతేమైందంటే?

Update: 2019-05-04 05:26 GMT
మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ ప్రాజెక్టు నిర్వాసితుల‌కు అందాల్సిన ప‌రిహారం మీద హైకోర్టు చేసిన వ్యాఖ్య‌లు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను క‌దిలించాయి. ఆయ‌న‌లో వ‌చ్చిన క‌దలిక‌ల‌కు చోటుచేసుకున్న ప‌రిణామాలు ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌కమాన‌దు.  నిర్వాసితుల్లో చాలామందికి ప‌రిహారం అందినా.. కొన్ని గ్రామాల వారు ముందుకు రాక‌పోవ‌టం.. దీనిపై కోర్టు ఘాటు వ్యాఖ్య‌లు చేయ‌టం తెలిసిందే.

ఈ నేప‌థ్యంలో కేసీఆర్ ఈ ఇష్యూ మీద ఫోక‌స్ చేవారు. వంద‌శాతం ప‌రిహారం ఇచ్చేలా అధికారులు ప‌ని పూర్తి చేయాల‌న్న ఆదేశంతో పాటు.. యుద్ధ ప్రాతిప‌దిక‌న జ‌రగాల‌న్న ఆదేశాన్ని జారీ చేశారు. కేసీఆర్ త‌లుచుకుంటే.. వ్య‌వ‌స్థ ఎంత‌లా దౌడు తీస్తుందో తాజా ఎపిసోడ్ ను చూస్తే ఇట్టే అర్థ‌మ‌వుతుంది. ఒక పెద్ద ప్రాజెక్టులో భాగంగా భూమి కోల్పోయిన నిర్వాసితుల‌కు పరిహారం ఇచ్చే విష‌యంలో నెల‌కొన్న స్త‌బ్ద‌త కేసీఆర్ క‌ద‌లిక‌తో తొల‌గింద‌ని చెప్పాలి.

కోర్టులు త‌ర‌చూ జోక్యం చేసుకునే ప‌రిస్థితులు రావ‌టంపై గులాబీ బాస్ కు కోపం వ‌చ్చింది. కోర్టుల చేత అదే ప‌నిగా చెప్పించుకోవ‌టం మంచిది కాద‌ని.. నిర్వాసితుల‌కు ప‌రిహారం ఇచ్చే కార్య‌క్ర‌మాన్ని యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాల‌ని కోరారు. దీనికి సంబంధించిన బాధ్య‌త‌ను సీఎస్ కు ప్ర‌త్యేకంగా అప్ప‌గించారు.

దీంతో.. అమెరికాకు వెళ్లాల్సిన ప్రోగ్రాంను ర‌ద్దు చేసుకున్నారు సీఎస్.  ప‌రిహారానికి సంబంధించిన నివేదిక‌ను ఈ నెల 11 లోపు పూర్తి చేసి హైకోర్టుకు ఇవ్వాల‌న్న ఆదేశాన్ని జారీ చేశారు. ల‌క్ష‌కోట్ల రూపాయిల వ్య‌యంతో తెలంగాణ‌లో 40 ల‌క్ష‌ల‌కు పైగా ఎక‌రాల‌కు సాగునీరు ఇచ్చేందుకు అతిపెద్ద కాళేశ్వ‌రం ప్రాజెక్టును నిర్మిస్తున్న త‌మ ప్ర‌భుత్వం నిర్ణ‌యం కార‌ణంగా కొంత‌మంది భూములు.. ఇళ్లు కోల్పోతున్నార‌ని.. అలాంటి వారి విష‌యంలో ప్ర‌భుత్వం ఎంతో సానుభూతితోనూ.. మాన‌వ‌త్వంతో వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని పేర్కొన్న కేసీఆర్ మ‌రో ఆస‌క్తిక‌ర వ్యాఖ్య చేశారు.

ఏనుగు పోయాక తోక మిగిలిన చందంగా.. ఒక బ‌డా ప్రాజెక్టులో మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ నిర్వాసితుల వ్య‌వ‌హారం చాలా చిన్న‌ద‌న్న‌ విష‌యాన్ని చెప్పే ప్ర‌య‌త్నం చేశారు కేసీఆర్‌. ప్ర‌గ‌తి నిరోధ‌క శ‌క్తులు ప్రాజెక్టును ఆప‌టానికి కుట్ర‌లు చేస్తున్నారంటూ మండిప‌డిన కేసీఆర్‌.. ప‌రిహారం ఇచ్చే కార్య‌క్ర‌మం వెంట‌నే స్టార్ట్ కావాల‌న్న ఆదేశంతో అధికారులు ప‌రుగులు తీశారు.

కేసీఆర్ నోటి నుంచి మాట వ‌చ్చిన గంటల వ్య‌వ‌ధిలోనే దాని ఎఫెక్ట్ క‌నిపించ‌టం మొద‌లైంది. సింగారం.. రాంపూర్ గ్రామాల ప‌రిధిలో 800 మంది నిర్వాసితుల‌కు చెక్కుల ద్వారా ప‌రిహారం ఇచ్చే ప్రోగ్రాం మొద‌లైంది. మిగిలిన గ్రామాల్లో ఈ రోజు (శ‌నివారం) ఇవ్వ‌నున్నారు. ఒక‌వేళ ఎవ‌రైనా చెక్కులు తీసుకునేందుకు నో అంటే. . వారి అభిప్రాయాన్ని వీడియోలో చిత్రీక‌రించాల‌ని అధికారులు నిర్ణ‌యించారు. తాజా ఊపు చూస్తే.. కేసీఆర్ కోరుకున్న‌ట్లుగా నిర్వాసితుల ప‌రిహారం కార్య‌క్ర‌మం ఈ ద‌ఫాతో పూర్తి కావ‌టం ఖాయ‌మ‌ని చెప్ప త‌ప్ప‌దు. రాజు త‌లుచుకుంటే జ‌ర‌గ‌ని ప‌ని ఏమైనా ఉంటుందా? 

Tags:    

Similar News