తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. నేడు గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానం పై సభ లో వాడివేడిగా చర్చ సాగుతోంది. గవర్నర్ చేత అన్ని తప్పుడు మాటలు మాట్లాడించారని విపక్షాలు , కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడుతున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలంగాణ ప్రభుత్వం పైకి ఆగ్రహం వ్యక్తం చేసాడు. తన సూటి ప్రశ్నలతో ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు. కేంద్రం నుండి రాష్ట్రంలో అమలైయ్యే పథకాలకు నిధులు వస్తున్నప్పటికీ..మొత్తం రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిచుస్తునట్టు ప్రచారం చేసుకుంటుంది అని మండిపడ్డారు.
ఈ విషయంలోనే .. కేసీఆర్ కిట్ స్కీమ్ గురించి మాట్లాడుతూ.. గర్భిణీలకు ఆరు వేలు రూపాయలు ఇస్తున్నారని రాజాసింగ్ అనగానే... టీఆర్ ఎస్ సభ్యులు 12వేల రూపాయలు ఇస్తున్నారంటూ కొంచెం గట్టిగానే అరుస్తూ చెప్పారు.ఇక గర్భిణీలకు కేంద్రం కూడా ఆర్థిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. ఆ విషయాన్ని పరోక్షంగా రాజాసింగ్ ప్రస్తావించారు. అలాగే కేసీఆర్ కిట్‌లో కేంద్రం నుంచి ఎంత వచ్చాయో చెప్పాలని అడగ్గా ...వెంటనే రియాక్ట్ అయిన సీఎం కేసీఆర్ , కేసీఆర్ కిట్ లో కేంద్రం వాటా ఒక్క శాతం కూడా లేదు అంటూ చేతులు పైకెత్తి ఊపారు. సీఎం చేయెత్తగానే అధికార పార్టీ సభ్యులు కూడా ఆయన్ను ఫాలో అయ్యారు.
అలాగే ఇంకా అయన మాట్లాడుతూ .. గుడుంబా తయారీ దారుల గురించి తనకు తెలుసు అని చెప్పిన సీఎం కేసీఆర్, ఆ తరువాత ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారని, ధూల్ పేట్ కు వస్తానని స్వయంగా తనతో చెప్పారని, ఎంతో మంది గుడుంబా తయారీదారులు అక్కడ ఉన్నారని, వారిని ఆదుకుంటామని చెప్పిన అయన ..ఇప్పటి వరకు అటు వైపే తొంగి చూడలేదు అని, సార్ దగ్గర సమయం లేనట్టుందని అంటూ సీఎం కేసీఆర్ కి చురకలు అంటించారు. అలాగే గవర్నర్ ప్రసంగం లోని పలు కీలక విషయాలపై కేసీఆర్ సర్కార్ కి సూటి ప్రశ్నలు వేస్తూ ఇరుకున పెట్టే ప్రయత్నం చేసారు.