నిజామాబాద్ జిల్లాలో నిర్వహించిన ఆశీర్వాద సభ సందర్భంగా కాంగ్రెస్ నేతల తీరుపై టీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ మండిపడిన నేపథ్యంలో ఆ పార్టీ నేతలు సైతం తగు రీతిలోనే రియాక్టవడం మొదలుపెట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై ఏఐసీసీ కార్యదర్శి మధుయాష్కీ గౌడ్ విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఓ అసమర్ధుడని - ముందస్తు ఎన్నికలు కేసీఆర్ కు భస్మాసురు హస్తమేనని వ్యాఖ్యానించారు. నిజామాబాద్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామన్నారు. సచివాలయానికి రాకుండా బులెట్ ప్రూఫ్ బాత్ రూమ్ లు కట్టుకున్న కేసీఆర్ తమపై విమర్శలు చేస్తున్నారని యాష్కీ ఎద్దేవా చేశారు. ``కేటీఆర్ ఆంధ్ర కాంట్రాక్టర్లతో కలిసి తిరుగుతుంది నిజం కాదా? అమరావతిలో కేసీఆర్ బాబుకు వంగి సలామ్ కొట్టింది నిజం కాదా? చంద్రబాబుతో రొయ్యల పులుసు తిన్నప్పుడు గుర్తురాసులేదా?`` అంటూ యాష్కీ మండిపడ్డారు.
రాష్ట్ర అభివృద్ధి అంటే రావుల అభివృద్ధి మాత్రమేనని యాష్కీ మండిపడ్డారు. ఆత్మగౌరం అంటున్న కేసీఆర్ ..కొడుక్కు ఎన్టీఆర్ పేరు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి - దళితులను సీఎం చేయడాన్ని కూడా ఆంధ్రావాళ్ళు ఆడ్డుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. టీఆరెస్ నేతలు అడ్డగోలుగా దోచుకుంటున్నారని ఆరోపించారు. కాపలా కుక్కలా ఉంటానన్న కేసీఆర్ ..నేడు కాటేసే నక్కలా మారాడని మండిపడ్డారు. ``కేసీఆర్ ..నీవు సీఎంగా ఉండి ఏడు మండలాలు ఎందుకు అడ్డుకోలేకపోయావు? కేసీఆర్ కు భవంతులకు జాగా దొరుకుతుంది కానీ పేదల ఇండ్లకు దొరకదా? `` అని ప్రశ్నించారు. దేశం కోసం పనిచేసిన చరిత్ర ఉత్తమ్ కుమార్ రెడ్డిదని - కేసీఆర్ నీది ..దుబాయ్ మామ బతుకు అని ఎద్దేవా చేశారు. తెలంగాణ కోసం తాను పనిచేసినప్పుడు ..కేసీఆర్ ఫాంహౌస్ లో పడుకున్నాడని వ్యాఖ్యానించారు. తెలంగాణ భవిష్యత్ కోసం ఏర్పడే వేదికనే మహాకూటమి అని మధుయాష్కీ వ్యాఖ్యానించారు. మహాకూటమిని చూసి కేసీఆర్‌కు భయం పట్టుకుందన్నారు.