ఒక రాష్ట్రానికి పెద్ద పరిశ్రమ వస్తుంటే అందరి కంటే ఎక్కువ ఆనందానికి గురయ్యేది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఆ రాష్ట్ర ప్రభుత్వాధినేత. అదే.. తమ రాష్ట్రానికి పయనీర్ లాంటి ఒక స్టార్ వాల్ట్ లాంటి పారిశ్రామికవేత్త వస్తుంటే.. అతని రాక కోసం కంట్లో ఒత్తులు వేసుకొని ఉండటమే కాదు.. గ్రాండ్ గా రిసీవ్ చేసుకొని.. మరికొందరు పారిశ్రామివేత్తలు తమ రాష్ట్రం వైపు చూసేలా చేయటం చాలామంది ముఖ్యమంత్రులు చేసే పని.
రోటీన్ కు భిన్నంగా ఉండటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అయితే..ఆయన చేసే చేష్టలు.. కొన్ని సందర్భాల్లో.. కొన్ని అంశాలకు సంబంధించిన విషయాల్లో ఆయన అనుసరించే విధానాలు చూసినోళ్లు నోరెళ్లబెట్టేస్తుంటారు. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది. ప్రపంచ ప్రఖ్యాత సంస్థల్లో ఒకటైన అమెజాన్ సంస్థకు చెందిన భారీ భవనం ఒకటి హైదరాబాద్ లో నిన్న ప్రారంభమైంది. దాదాపుగా 9.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనం హైదరాబాద కు సిగలో ఒక హారంగా అభివర్ణిస్తున్నారు.
మరి.. ఇంత భారీ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరు కావాల్సిన ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరు కాగా.. ఆయన స్థానంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ ప్రారంభించటం విశేషం. ఏ రాష్ట్రంలో అయినా.. భారీ ప్రాజెక్టును.. పరిశ్రమను ప్రారంభించటానికి ఆయా రాష్ట్ర ముఖ్యమంత్రులు ఆసక్తి చూపుతుంటారు.
అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్. నిజానికి.. విచిత్రంగా వ్యవహరించటం గులాబీ బాస్ కు పెట్టింది పేరుగా చెబుతారు. తెలంగాణ రాష్ట్రానికి టాటా సంస్థల అధినేత రతన్ టాటా హైదరాబాద్ కు వస్తే.. ఆ కార్యక్రమానికి హాజరు కాకుండా ఫాంహౌస్ లోనే ఉండిపోయారు కేసీఆర్.
ఆరోగ్యం బాగా లేక కానీ.. ఇతరత్రా కీలకమైన కార్యక్రమాల కారణంగా హాజరు కాకపోవటం ఒక ఎత్తు. అందుకు భిన్నంగా కారణం ఏమీ చెప్పకుండానే కీలకమైన ప్రోగ్రామ్స్ కు డుమ్మా కొట్టటం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమన్న విమర్శ ఉంది. తాజా అమెజాన్ భారీ భవన ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి ఎందుకు హాజరు కాలేదన్న విషయానికి అధికారికంగా ఎలాంటి వివరణ లేదు. ఏమైనా.. భారీ ప్రాజెక్టుల ప్రారంభంలో హాజరుకాకుండా ఉండటం సీఎం కేసీఆర్ కు మాత్రమే సాధ్యమన్న మాట మరోసారి నిరూపితమైందంటున్నారు.