తెలంగాణలో పండిన ధాన్యం కొనుగోలు అంశంపై రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ మధ్య యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణలోనూ పండిన మొత్తం ధాన్యాన్ని పంజాబ్ తరహాలో కేంద్రం కొనుగోలు చేయాలని తెలంగాణ సీఎం కేసీఆర్ సర్కారు డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే.
ఈ అంశంపై కేంద్రంతో పోరుకు సిద్ధమైన సీఎం కేసీఆర్... మంత్రులు నిరంజన్ రెడ్డి, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, వేముల ప్రశాంత్ రెడ్డిలను ఢిల్లీకి పంపించిన సంగతి తెలిసిందే. మరోవైపు, ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయబోతోందనే వార్తలు వస్తున్నాయి. ఇలాంటి తరుణంలో టీపీసీసీ రథసారథి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
ధాన్యం కొనుగోలు, ప్రస్తుత పరిణామాలపై టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి స్పందిస్తూ, రైతుల సమస్యలకు కారణం టీఆర్‌ఎస్ ప్రభుత్వమేనని ఆరోపించారు. రైతుల నుంచి ధాన్యం కొనాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. కొన్న ధాన్యాన్ని ఎవరికి అమ్ముకుంటుందో రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమన్నారు.
కేసీఆర్ ప్రతి గింజా కొంటామన్నారని.. కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అని రేవంత్ రెడ్డి వివరించారు. ముఖ్యమంత్రి ఈ అంశంపై ప్రధానిని ఎందుకు కలవడం లేదన్నారు. ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందంలో మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఎందుకు లేరని ప్రశ్నించారు. ఢిల్లీలో కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తానంటే తామూ ఏర్పాట్లు చేస్తామని రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాగా, ధాన్యం సేకరణ విషయంలో కేంద్రంపై టీఆర్‌ఎస్ పోరుకు సిద్ధమవుతోంది. ఆదివారం నుంచి గులాబీ పార్టీ కార్యాచరణ ప్రకటించింది. ధాన్యం కొనాలని ఏప్రిల్ 1 వరకు గ్రామస్థాయి తీర్మానాలు చేయాలని, ఉగాది తర్వాత ఉద్యమాన్ని ఉధృతం చేయబోతున్నట్లు పార్టీ వివరించింది. ఈ నెల 28, 29న కార్మికుల సమస్యపై సార్వత్రిక సమ్మెకు సైతం టీఆర్ఎస్ పార్టీ మద్దు ప్రకటించింది.