సరికొత్త రాజకీయం చేస్తున్న సీఎం

Update: 2021-05-25 03:30 GMT
తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ అక్కడి రాజకీయాలకు పూర్తిగా కొత్త పంథాలో ముందుకెళుతున్నారు. ప్రతిపక్షంలోనే కొత్త రాజకీయాలు చేసిన స్టాలిన్.. ఇప్పుడు సీఎంగా ఇప్పటిదాకా నడిచిన సీఎంలకు భిన్నంగా వెళుతున్నారు.ప్రతీకార రాజకీయాలకు స్వస్తి పలుకుతూ అందరినీ కలుపుకొని పోతూ ప్రజలకు మేలు చేసేలా సరికొత్త రాజకీయం మొదలుపెడుతున్నారు.

జయలలిత, కరుణానిధి.. వారి వారసులు చేస్తున్న పాలనకు భిన్నంగా స్టాలిన్ వెళుతున్నారు. ఇదివరకు సీఎంలు ప్రత్యర్థుల పథకాలకు పాతరేసేవారు. కానీ స్టాలిన్ మాత్రం తన ప్రత్యర్థి అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత అమ్మ క్యాంటీన్లను కొనసాగించడం విశేషంగా మారింది. ఇక కరోనా సంక్షోభాన్ని నియంత్రించేందుకు అసెంబ్లీలో ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో ఓ కమిటని వేయడం గొప్ప చర్యగా అందరూ అభివర్ణించారు. ఈ రెండు నిర్ణయాలు స్టాలిన్ లోని గొప్పతనాన్ని చాటిచెప్పాయి.

ఇక అసెంబ్లీ సమావేశాల్లోనూ స్టాలిన్ జయలలితను కానీ.. సీఎం ఫలని స్వామిని ఒక్క మాట కూడా అనకుండా ఆరోపించకుండా అందరి మనసు చూరగొన్నారు. విధానపరంగానే విమర్శలు చేశారు. దీన్ని బట్టే స్టాలిన్ కొత్త తరహా రాజకీయాలకు తెరలేపారనే విషయం అర్థమవుతోంది. ఈ పద్ధతులను సీఎం అయిన తర్వాత కూడా స్టాలిన్ కొనసాగిస్తూ అందరి మనసులు చూరగొంటున్నారు.
Tags:    

Similar News