తాము కన్నేసిన రాష్ట్రం ఏదైనా సరే.. తాము అనుకున్న వారే అధికారంలో ఉండాలన్నట్లుగా ప్లానింగ్ చేస్తున్న మోడీషాలకు మొదటిసారి ఎదురుదెబ్బ తగిలింది. బిహార్ లో జేడీయూ మిత్రపక్షంతో నడుపుతున్న ప్రభుత్వానికి కీలకమైన ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మోడీషాలకు షాకిచ్చారు. బీజేపీ - జేడీయూ బంధానికి శుభంకార్డు వేసిన ఆయన.. వారికి గుడ్ బై చెప్పేందుకు డిసైడ్ అయ్యారు.
ప్రస్తుతం బీజేపీ బలంతో నడుస్తున్న నితీశ్ ప్రభుత్వం రానున్న రోజుల్లో కాంగ్రెస్.. ఆర్జేడీయూల బలంతో ముందుకు వెళ్లనుంది. బీజేపీ అవమానించిందని.. పార్టీని బలహీన పర్చేందుకు ప్రయత్నించిందన్న నితీశ్.. అందుకు తగ్గట్లే.. బీజేపీ బలానికి నమస్కారం పెట్టేసి.. ఇతర మిత్రులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు డిసైడ్ అయ్యారు.
మొత్తంగా బిహార్ రాజకీయం ఒక్కసారి మార్పులు చోటు చేసుకోవటంతో పాటు.. అనూహ్య పరిణామాలకు తెర లేచినట్లైంది. మంగళవారం బిహార్ రాజకీయాల్లో కీలకంగా చోటు చేసుకున్న ఐదు పరిణామాల్ని చూస్తే..
1. తమ పార్టీ నేతలతో సమావేశమైన బిహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్.. బీజేపీ తమను మోసం చేసిందని.. అందుకే వారితో విడిపోతున్నట్లుగా పేర్కొన్నారు. ఆర్జేడీ.. కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కొత్త సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లుగా వెల్లడించారు.
2. పార్టీ నేతలతో కలిసి బీజేపీతో కటీఫ్ చెప్పేందుకు డిసైడ్ అయిన నితీశ్.. అందుకు తగ్గట్లుగా వారిందరి అనుమతి తీసుకొని.. మోడీషాలకు ఇచ్చే రాజకీయ పంచ్ ను వెల్లడించటంతో పాటు సాయంత్రం నాలుగు గంటల వేళలో గవర్నర్ తో భేటీ కానున్నారు. సీఎం పదవికి రాజీనామా చేయనున్నారు.
3. నితీశ్ ఆధ్వర్యంలో జరిగిన జేడీయూ సమావేశ సమయంలోనే లాలూ ప్రసాద్ యాదవ్ కు చెందిన ఆర్జేడీ పార్టీ మీటింగ్ పాట్నాలో చోటు చేసుకుంది. ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ కూడా గవర్నర్ తో భేటీ కానున్నారు. మారిన సమీకరణాలకు సంబంధించిన వివరాల్ని గవర్నర్ కు తెలియజేయటం ద్వారా కొత్త ప్రభుత్వ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నాయి.
4. నితీశ్ ఇచ్చే షాక్ వల్ల తమకు జరిగే నష్టాన్ని గుర్తించిన బీజేపీ అధినాయకత్వం ఆ ప్రయత్నాలు ముందుకు సాగకుండా ఉండేందుకు చివరి ప్రయత్నాలు చేశాయి. అయినప్పటికీ నితీశ్ మాత్రం బీజేపీతో కటీఫ్ చెప్పేందుకే డిసైడ్ కావటంతో కమలనాథులకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లైంది. తాజా పరిణామాల నేపథ్యంలో పాట్నాలో బీజేపీ నేత.. ఉప ముఖ్యమంత్రి తార్కిషోర్ ప్రసాద్ ఇంట్లో బీజేపీ సమావేశం జరిగింది.అంతేకాదు పాట్నాలోని బీజేపీ పార్టీ ఆఫీసులోనూ కోర్ మీటింగ్ జరిగింది. అయినప్పటికీ నితీశ్ ను బుజ్జగించే విషయంలో కమలనాథులు ఫెయిల్ అయ్యారు.
5. ప్రభుత్వం ప్రస్తుతానికి రద్దు అయినప్పటికీ.. రోజుల వ్యవధిలోనే కొత్త పొత్తులతో.. కొత్త మిత్రులకు మళ్లీ నితీశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉండటంతో పదవుల విషయంలో జేడీయూ నేతలకు ఎలాంటి ఇబ్బందులు లేకపోగా.. ఆర్జేడీ.. కాంగ్రెస్ లతో పవర్ పంచుకునే విషయంలో వారు ఓకే చెప్పినట్లు చెబుతున్నారు. తాజా పరిణామాలతో మళ్లీ ముఖ్యమంత్రిగా నితీశ్ బాధ్యత తీసుకుంటే.. ఉప ముఖ్యమంత్రిగా లాలూ కుమారుడు తేజస్వి యాదవ్ పదవీ బాధ్యతలు చేపడతారు. హోం మంత్రిత్వ శాఖను ఆయన తన చేతుల్లో ఉంచుకోనున్నారు.