సీఎం విజయన్ లేఖలో ‘జగన్ మాట’..!

Update: 2021-06-01 05:30 GMT
ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన విజయాన్ని సొంతం చేసుకొని దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు కేరళ రాష్ట్ర సీఎం పినరయి విజయన్. కమ్యునిస్టుపార్టీకి కొత్త ఊపిరిని పోసేలా ఆయన విజయాన్ని నమోదు చేశారు. దీంతో.. ఇప్పుడా పార్టీలో ఆయన తిరుగులేని నేతగా మారారు. కరోనా వ్యాక్సిన్ విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరును తప్పు పడుతూ.. దేశంలోని బీజేపీయేతర పాలనలో ఉన్న11 రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఆయన లేఖ రాశారు.

రాష్ట్రాలకు అవసరమైన టీకాల్ని కేంద్రమే సేకరించి ఉచితంగా పంపిణీ చేయాలన్న డిమాండ్ ను అన్ని రాష్ట్రాలు కలిసి కట్టుగా కేంద్రంపై ఒత్తిడి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన లేఖలో ప్రస్తావించిన అంశాల్ని జాగ్రత్తగా గమనిస్తే.. ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా చర్చకు తెర తీశాయి. దేశంలోని ప్రభుత్వ రంగ ఫార్మా కంపెనీలు వ్యాక్సిన్లు తయారు చేసే సామర్థ్యంతో ఉన్నందున అలాంటి కంపెనీలకు కేంద్రం పేటెంట్ హక్కులు కల్పించాలని కోరారు.

దీంతో.. వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచటం ద్వారా.. టీకా కార్యక్రమాన్ని మరింత వేగంగా నిర్వహించొచ్చని పేర్కొన్నారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సైతం ఇదే అభిప్రాయాన్ని ఇటీవల వ్యక్తం చేశారు. టీకా ఫార్ములాను వాటిని ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉన్న వారికి అందజేయటం ద్వారా.. దేశీయంగా టీకా కొరతను అధిగమించే వీలుందని పేర్కొనటం తెలిసిందే. ఇప్పుడు అదే మాట కేరళ సీఎం రాసిన లేఖలోనూ ఉండటం గమనార్హం.
Tags:    

Similar News